ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 మార్చి 2022 (17:45 IST)

మేకను బలిచ్చిన పవన్ ఫ్యాన్స్ - ఆయుధాల చట్టం కింద కేసు నమోదు

ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం విడుదలైంది. ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ జంతుబలిచ్చారు. పాలాభిషేకాలు నిర్వహించారు. ఇలా జంతుబలిచ్చినందుకు చిత్తూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ వీరాభిమానులపై పోలీస్ కేసు ఒకటి నమోదైంది. 
 
ఆంధ్రప్రదేస్ జంతువులు, పక్షులు, బలి నిరోధక చట్టం 1950లోని సెక్షన్ 6 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేకాకుండా ఐపీసీ 34, 429, ఆయుధాల చట్టం సెక్షన్ 25(1) (A), పీసీఏ 11(1) (a) కింద కూడా కేసు నమోదు చేశారు. 
 
అంటే, పవన్ కళ్యాణ్ అభిమానులపై జంతు బలి కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను అషర్ అనే అడ్వకేట్ వెల్లడించారు. అంతేకాకుండా మేకను బలిస్తున్న ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు.