సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 17 జనవరి 2017 (18:36 IST)

"నాన్ బాహుబలి'' రికార్డులేంటి? ఇకపై "నాన్ ఖైదీ నెం.150 రికార్డులే''!: సాయి మాటలే నిజమయ్యాయ్!

మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి స్టైల్‌ను అనుకరిస్తాడు. అంతేగాకుండా మెగా వారసుడిగా ఇతడే అయిపోతాడేమోనని.. చెర్రీ ఆఫర్లుండవేమోనని అప్పట్లో టాక్ వచ్చింది. తండ్రి సినిమ

మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి స్టైల్‌ను అనుకరిస్తాడు. అంతేగాకుండా మెగా వారసుడిగా ఇతడే అయిపోతాడేమోనని.. చెర్రీ ఆఫర్లుండవేమోనని అప్పట్లో టాక్ వచ్చింది. తండ్రి సినిమాలను తానే అనుకరిస్తానని.. ఆయన సినిమాలను రీమేక్ చేసే అవకాశాన్ని వదులుకోమని చెర్రీ సాయిధరమ్ తేజ్‌కి వార్నింగ్ ఇచ్చినట్లు కూడా వార్తలొచ్చాయి. అయితే సాయిధరమ్ తేజ్ మాత్రం చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని ప్రతి విషయంలోనూ నిరూపించుకుంటూ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. 
 
ఈ నేపథ్యంలో ఖైదీ రిలీజ్‌కు ముందే సాయి ధరమ్ తేజ్ చిరంజీవి సినిమాపై జోస్యం చెప్పాడు. ప్రస్తుతం అందరూ నాన్ బాహుబలి రికార్డులంటూ మాట్లాడుకుంటున్నారు. ఇకపై నాన్ ఖైదీ నెంబర్ 150 రికార్డులు అంటూ మాట్లాడుకుంటారని.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ  వ్యాఖ్యలే ప్రస్తుతం నిజమైనాయి. అప్పట్లో ఖైదీ సినిమా మీద మరీ అంచనాలు పెట్టుకున్నాడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
కానీ, ఇప్పుడు అతడు అన్న మాటలే కొంత వరకు నిజమయ్యాయి. సినిమా విడుదలైన తొలి వారంలో చాలా చోట్ల ఖైదీ బాహుబలి కలెక్షన్లను బ్రేక్ చేసింది. కృష్ణా జిల్లాలో తొలివారం బాహుబలి రూ.3.63 కోట్ల షేర్ వసూలు చేస్తే.. ఖైదీ రూ.3.77 కోట్లు సాధించేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో బాహుబలికి రూ.4.48 కోట్లు రాబడితే.. చిరు సినిమా ఒక్క రోజు ముందే (వారానికి) రూ.4.55 కోట్లు కొల్లగొట్టింది.
 
తూర్పుగోదావరి జిల్లాలో ఖైదీ నంబర్ 150 రూ.5.92 కోట్లు, నెల్లూరులో ఆరో రోజుకు వచ్చే సరికి రూ.2.25 కోట్ల కలెక్షన్లను సాధించింది. ఆ రెండు జిల్లాల్లోనూ బాహుబలిని బీట్ చేసింది ఖైదీ నంబర్ 150. వైజాగ్‌లోనూ బాహుబలిపై చిరు సినిమాపై చేయి సాధించింది.