మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 29 నవంబరు 2018 (15:03 IST)

"2.O" మూవీలో పక్షిరాజు పాత్రకు స్ఫూర్తి ఎవరో తెలుసా?

శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ - అక్షయ్ కుమార్ కథానాయుడు, ప్రతి కథానాయకుడుగా నటించిన చిత్రం "2.O". ఈ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ పోషించిన పాత్ర పేరు 'పక్షిరాజు'. ఈ పాత్రకు స్ఫూర్తి ఎవరో చిత్ర కథా రచయిత జయమోహన్ మాట్లాడుతూ ప్రఖ్యాత విహంగ శాస్త్ర నిపుణుడు, పర్యావరణవేత్త, 'బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా గుర్తింపు పొందిన సలీం అలీ ఇపుడు జీవించివున్నట్టయితే నేటి పరిస్థితులను చూసి ఆయన తీవ్ర ఆవేశానికి లోనయ్యేవారు. 
 
ముఖ్యంగా, దినదినాభివృద్ధి చెందుతున్న సాంకేతిక వినియోగ సంస్కృతి కారణంగా పర్యావరణానికి జరుగుతున్న కీడును చూస్తే ఎంతో ఆగ్రహానికి గురయ్యేవారు. దీన్ని చూపించేందుకే పక్షిరాజు పాత్రను సృష్టించినట్టు ఆయన తెలిపారు. నిజానికి ఈ పాత్రను విశ్వనటుడు కమల్ హాసన్ చేయాల్సివుంది. అందుకుతగినట్టుగానే సినిమాలో మొత్తం ఉద్వేగాన్నంతటినీ ఆ పాత్రలో చొప్పించడం జరిగిందన్నారు.
 
కాగా, "2.O" చిత్రంలో అక్షయ్ కుమార్ చాలా కీలకమైన పాత్రను పోషించారు. "పక్షుల్ని బతికించండి.. భూమిని కాపాడండి" అంటూ పక్షిరాజా పాత్రలో ఒదిగిపోయాడు. రేడియేషన్ కారణంగా పక్షులు ఒక్కొక్కటిగా చనిపోతుంటే వాటిని చూసి తల్లడిల్లిపోయే పర్యావరణ ప్రేమికుడిలా అక్షయ్ పాత్రను దర్శకుడు శంకర్ రూపొందించాడు. 
 
ఈ చిత్రంలో అంతలా ఆకట్టుకున్న ఈ పాత్రకు స్ఫూర్తి సలీం అలీ. భారత ఉపఖండంలోని పక్షిజాతులపై తొలి సర్వే చేసిన ప్రఖ్యాత విహంగశాస్త్ర నిపుణుడు. అలాంటి మహనీయుడి జీవితంలోని కొన్ని అంశాల ఆధారంగానే పక్షిరాజు ఆవిష్కృతమయ్యాడు. కాగా, బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా గత 1987లో జూన్ 20వ తేదీన కన్నుమూశారు. ఈయనకు పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అనే పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.