శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chtra
Last Updated : మంగళవారం, 12 జులై 2016 (09:37 IST)

నా కుమారుడు సల్మాన్‌ తాతలా కనిపిస్తున్నారా?: సలీం ఖాన్ మండిపాటు

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌పై ఒక టీవీ ఛానెల్ చేసిన సంచలన వాఖ్య‌ల‌కు ఆయ‌న తండ్రి స‌లీం ఖాన్ మీడియాపై విరుచుకుపడ్డారు. అసలు విషయం ఏంటంటే... ఒక టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చా వేదికలో సల్మాన్‌ని తాత

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌పై ఒక టీవీ ఛానెల్ చేసిన సంచలన వాఖ్య‌ల‌కు ఆయ‌న తండ్రి స‌లీం ఖాన్ మీడియాపై విరుచుకుపడ్డారు. అసలు విషయం ఏంటంటే... ఒక టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చా వేదికలో సల్మాన్‌ని తాత వయస్సుతో పోల్చారు. ఈ వ్యాఖ్యలపై సల్మాన్ తండ్రి సలీం ఖాన్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై సలీం తనదైన శైలిలో స్పందించారు. 
 
ఇటువంటి వ్యాఖ్యలు చేసేవారు సల్మాన్ ''సుల్తాన్'' సినిమా చూసి మాట్లాడాలని, తాత వయస్సులో ఉంటే కనుక సల్మాన్ ఇంతలా నటించగలడా అని సలీం తన ట్విట్టర్ ఖాతా అందరికి ఎదురు ప్రశ్నవేశారు. మనోభావాలను దెబ్బతీసే విషయంలో కొంతమంది ముందుంటారని, అటువంటి వారిలో ఆ తత్వాన్ని పోగొట్టేందుకు వారిలో మానవత్వాన్ని మేల్కొపాలని.. ఎందుకంటే, అదే గొప్ప మతం అని తన ట్వీట్‌లో సలీం పేర్కొన్నారు.