Biodata Maker
✕

అన్నింటికి నిశ్శబ్దమే సమాధానం... కవితాత్మక ధోరణిలో సమంత పోస్ట్

Written By ఠాగూర్
Updated: గురువారం, 7 అక్టోబరు 2021 (12:30 IST)
టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌గా పేరుగాంచి అక్కినేని నాగచైతన్య, సమంతల ఐదో పెళ్లి వార్షికోత్సవ వేడుక నేడు. అయితే, ప్రస్తుతం వీరిద్దరూ విడిపోయారు. ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో ఈ అంశంపైనే విప‌రీతంగా చ‌ర్చ జ‌రుగుతుంది. 
 
సామాజిక మాధ్య‌మాల్లో ఎన్నో వ‌దంతులు వ‌స్తోన్న నేప‌థ్యంలో స‌మంత అధికారికంగా ఏమైనా ప్ర‌క‌ట‌న చేస్తుందా? అన్న విష‌యంపై నెటిజ‌న్లు చాలా ఆస‌క్తిగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో స‌మంత ఈ రోజు చేసిన ఓ పోస్ట్ మ‌రింత ఆస‌క్తిని రేపుతోంది. 
 
'పాత ప్రేమ పాటలు.. పర్వతాలు.. శిఖరంపై చ‌లికాలంలో గాలి శ‌బ్దం.. పోగొట్టుకున్న పాత సినిమాల‌ పాటలు దొరికినప్పుడు... మ‌న‌సులోని బాధను ప్రతి ధ్వనించే ప్రేమ పాటలు... పాత బంగ్లాలు... మెట్ల మార్గాలు... సందులలో గాలివీస్తున్న శబ్దం'... అంటూ సమంత క‌వితాత్మ‌క ధోర‌ణిలో ఈ పోస్ట్ చేసింది. 
 
మరోపక్క, రేపు ఆమె లక్మే ఫ్యాషన్ షోలో పాల్గొన‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఫ్యాష‌న్ దుస్తులు ధ‌రించి ఆమె ఇందుకు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటోలోను బాధ‌ప‌డుతున్న‌ట్లు ఆమె ముఖం ఉండ‌డం గ‌మ‌నార్హం. 

అన్నీ చూడండి

ఆరోగ్య శాఖలో కలకలం - నకలీ డెత్ సర్టిఫికేట్లతో కారుణ్య ఉద్యోగాలు

బంజారా హిల్స్‌లో పట్టపగలు దారుణ హత్య.. వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశారు... (వీడియో)

ఉద్యోగులకు దీపావళి కానుక : నగదు కట్టలు! (వీడియో)

సొంత చెల్లికి ఆస్తిలో భాగం ఇవ్వాల్సివస్తుందని బయటకు గెంటేసిన కేటీఆర్ : సీఎం రేవంత్ రెడ్డి

ఏపీలోని పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

అన్నీ చూడండి

కిడ్నీలు 90 శాతం పాడైపోయేవరకూ లక్షణాలు కనిపించవా?

రుచీపచీ లేని ఈ పండు చేసే మేలు ఎంతో తెలుసా?

ఫ్రిజ్‌లో కోడిగుడ్లు పెడితే ఏమవుతాయి?

ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత ప్రజలకు తుఫాను అనంతర హెల్త్ అడ్వైజరీ జారీ చేసిన స్టార్ హెల్త్

ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై హెర్బాలైఫ్ ఇండియా, ఐఐఎస్‌సీ చారిత్రాత్మక అధ్యయనం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments