గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (20:03 IST)

మోస్ట్ పాపులర్ హీరోయిన్‌గా సమంత (video)

ఇటీవల తన వైవాహిక జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టిన హీరోయిన్ సమంత ఇపుడు మోస్ట్ పాపులర్ హీరోయిన్‌గా నిలిచారు. సోషల్ మీడియాలో అత్యంత పాప్యులారిటీ ఉన్న తెలుగు హీరోయిన్ల జాబితాలో ఈమె అగ్రస్థానంలో నిలిచారు. 
 
ఈ స్థానంలో ఉన్న మరో హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ను వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని సమంత ఆక్రమించుకున్నారు. రెండో స్థానంలో కాజల్, మూడో స్థానంలో అనుష్క శెట్టి నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా రష్మిక మందన్న, తమన్న భాటియా, కీర్తి సురేశ్, పూజ హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా, సాయి పల్లవి ఉన్నారు. 
 
ఈ వివరాలను ప్రముఖ సర్వే సంస్థ ఆర్మాక్స్ మీడియా వెల్లడించింది. మరోవైపు ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచిన సమంత ఇటీవలి కాలంలో పతాక శీర్షికల్లో నిలిచిన సంగతి తెలిసిందే. 
 
అక్కినేని నాగచైతన్యతో విడిపోతోందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. తొలుత ఆ వార్తలన్నీ పుకార్లుగానే అనుకున్నప్పటికీ... చివరకు అదే నిజమైంది. వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు ఇద్దరూ ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో సమంత పేరు మార్మోగిపోయింది.