గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 5 జులై 2024 (13:23 IST)

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

samanta
మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత.. ఈ మధ్య ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ ఉంది. తాజాగా సమంత చేసిన ఓ పోస్టు ఇప్పుడు ఆమెను వివాదంలోకి లాగింది. సమంత నెబ్యులైజర్‌ను ఉపయోగిస్తున్న తన ఫోటోను షేర్ చేసింది, సాధారణ వైరల్‌ మందులకు బదులు హైడ్రోజన్ పెరాక్సైడ్, డిస్టిల్డ్ వాటర్ కలపడం 'మేజిక్ లాగా పనిచేస్తుందని' సూచించింది. అయితే దీనిపై కొందరు డాక్టర్లు మండిపడుతున్నారు. సమంతపై విమర్శలు చేస్తున్నారు. 
 
నటి సమంత వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి పీల్చడం చెయ్యండని చెప్తూ తన ఇన్‌స్టాలో పెట్టినట్లు లివర్ డాక్టర్ పెట్టారు. ఇదే నిజమైతే ఇంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదు. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక అన్‌స్టేబుల్ రసాయనం, ఇది నీరు మరియు ఆక్సిజన్‌గా మారుతుంది. 
 
అయితే ఈ ఆక్సిజన్ అణువులుగా మారేముందు పరమాణువులుగా ఉన్నప్పుడు ఫ్రీ రాడికల్స్‌లో పనిచేసి అవి అప్పటికే వైరస్ వలన దెబ్బతిన్న ఊపిరితిత్తుల లోపలి పలుచని పొరల్ని బాగా దెబ్బ తీసి, న్యుమోనియాగానీ, ఏక్యూట్ రెస్పిటేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్‌కి గానీ దారి తీస్తుంది. ఇదొస్తే డైరెక్టు సావే… అంటూ కొందరు డాక్టర్లు సమంత ఇచ్చిన సలహాపై మండిపడుతున్నారు.
 
సమంత చేసిన పోస్టు పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలా హానికరమైన సలహాలు ఎవరైనా ఇచ్చినప్పుడు వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడే, అందరూ పోస్టులు చేసేముందు జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు ఉన్న చట్టాలు సరిపోతాయి అనుకొంటానని మరో నెటిజన్ పోస్టు చేశారు. 
 
మరికొందరు.. హైడ్రోజన్ పెరాక్సైడ్ చెవి శుభ్రం చేయడానికి కూడా వాడుతుంటాం కదా.. ఇందులో కొత్తేం ఉంది.. తప్పేముందని అంటున్నారు. అయితే సమంత చేసిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చే లేపింది.
 
తనపై వస్తున్న విమర్శలకు కామెంట్లకు.. డాక్టర్ పెట్టిన పోస్టుకు కూడా సమంత స్పందిందింది. ఆ డాక్టర్ కాస్త మర్యాదగా ఉండాలని కోరింది. తన హెల్త్‌కు సంబంధించిన పోస్టులు పెట్టనిప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటానని.. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొనే పెడతానని సమంత పేర్కొంది. సమంతకు మంచులక్ష్మీ వరుణ్ ధావన్ సపోర్టుగా కామెంట్స్ చేశారు.