గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 4 జులై 2024 (09:53 IST)

లైవ్‌లో రిపోర్టింగ్ చేస్తున్న మహిళా జర్నలిస్టు... వెనుక కుమ్మేసిన ఎద్దు!! (Video)

pak journalist
పాకిస్థాన్ దేశంలో ఓ మహిళా జర్నలిస్టుకు చేదు అనుభవం ఎదురైంది. ఎద్దుల జంట ధరపై స్థానిక వ్యాపారులతో మాట్లాడుతూ, లైవ్ రిపోర్టు చేస్తున్న మహిళా జర్నలిస్టుపై ఓ ఎద్దు వెనుక నుంచి దాడి చేసింది. దీంతో ఆమె అల్లంత దూరాన ఎగిరిపడింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకు ఇప్పటికే మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే, ఇది సరిగ్గా ఎక్కడ జరిగిందన్న విషయం తెలియరాలేదు.
 
వ్యాపారులు ఎద్దుల జంటలను రూ.5 లక్షల కంటే తక్కువకు అమ్మేందుకు సిద్ధంగా లేరని ఆమె చెబుతుండగానే వెనుక నుంచి వచ్చిన ఎద్దు కుమ్మి పడేసింది. ఆమె కేకలు వేస్తూ అంత దూరాన పడింది. చెల్లాచెదురుగా పడిన ఆమె మైక్రోఫోన్, మౌతు తీసుకొచ్చిన ఓ వ్యాపారి ఆమెకు అందించాడు. 
 
గాయపడిన ఆమె అతికష్టంగా లేచి నిలబడింది. ఈ వీడియోకు ఇప్పటికే మిలియను పైగా వ్యూస్ వచ్చాయి. దీనిపై యూజర్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. లైవ్ రిపోర్టింగ్లో ఇదో అకస్మాత్తు పరిణామమని కొందరు కామెంట్ చేశారు. ఫీల్డ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని మరికొందరు సలహా ఇచ్చారు.