శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 3 జులై 2024 (15:07 IST)

జనసేన జెండాతో ఇంటి ముందు నిల్చొన్న బాలుడు... కారు దిగి షేక్‌హ్యాండ్ ఇచ్చిన పవన్!!

pawan child fan
ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరుసగా మూడో రోజు కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. మంగళవారం ఉదయం 10.45 గంటలకు పవన్ ఉప్పాడ చేరుకున్నారు. తీరంలో సముద్రపు కోతను పరిశీలిస్తున్న ఆయన హార్బర్ సముద్ర మొగ వద్ద మత్స్యకారులతో సమావేశమవుతారు. సాయంత్రం నాలుగు గంటలకు పిఠాపుపరం ఉప్పాడ సెంటర్‌లో నిర్వహించనున్న వారాహి బహిరంగ సభలో పాల్గొంటారు. 
 
కాగా, పవన్ పిఠాపురం వెళ్తున్నపుడు ఆసక్తికర ఘటన ఒకటి చోటుచేసుకుంది. పవన్ కాన్వాయ్ తమ ఇంటి ముందు నుంచి వెళ్తుందన్న విషయం తెలిసిన ఓ కుటుంబంలోని చిన్నారి జనసేన జెండా పట్టుకుని రోడ్డు పక్కన నిల్చుని ఊపుతున్నాడు. అంతేలోనే అటుగా వచ్చిన పవన్ అదిచూసి తన కారు ఆపారు. 
 
కారు ఆగడంతో చిన్నారి పరుగెత్తాడు. కిందికి దిగిన పవన్ అతడికి షేక్‌హ్యాండ్ ఇచ్చి కారెక్కబోయారు. ఈలోపు పవన్ భద్రతా సిబ్బందిని పిల్లాడిని పట్టుకుని పవన్ వద్ద తీసుకెళ్లారు. ఈలోపు అక్కడికి వచ్చిన అభిమానుల్లో ఒకరు పవన్ కాళ్ల దండం పెట్టడం కనిపించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి పవన్ అభిమానులు తెగ ముచ్చటపోతున్నారు.