ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 3 జులై 2024 (08:43 IST)

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

paruchuri gopalakrishna
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఓ విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై ఆయన పరుచూరి పలుకులు పేరుతో సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. "నాన్న పవన్... మా 24 క్రాఫ్టులకు చెందిన సమస్యలను ఓసారి వినాలని కోరారు. ఇందుకోసం మా సభ్యులందరితో కలిసి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఏపీ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ను కూడా ఆహ్వానిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. మా సమస్యలు ఆలకించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ముఖ్యంగా, మీకు చిత్రపరిశ్రమ ఎంతో చేసిందని, ఆ కారణంగానే ఈ స్థాయికి చేరుకున్నారని, అలాంటి చిత్రపరిశ్రమకు రుణం తీర్చుకునే అవకాశం మీకు దక్కిందని కోరారు. మరోవైపు రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకోవడంతో పాటు సినిమాల్లో కూడా నటించాలని పరుచూరి గోపాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఆ వీడియోను మీరు కూడా చూడండి.