బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 జూన్ 2024 (22:33 IST)

రుషికొండ ప్యాలెస్‌‌ను నాకు అమ్మేయండి లేదా లీజుకు ఇవ్వండి?

rushikonda palace
విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్‌పై ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కరుడుగట్టిన నేరస్తుడు సుఖేష్ చంద్రశేఖర్ తన ఆసక్తిని వ్యక్తం చేశాడు. జైలు నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. భవనాన్ని తనకు విక్రయించాలని లేదా లీజుకు ఇవ్వాలని సుకేష్ సీఎంను అభ్యర్థించాడు. 
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మార్కెట్ విలువ కంటే 20శాతం అదనంగా చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. తన లేఖను ఆస్తి కొనుగోలుకు అధికారిక ఒప్పందంగా పరిగణించాలని పేర్కొన్నాడు. 
 
ఆర్థిక మోసాల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుకేష్ చంద్రశేఖర్.. దేశంలోనే సంచలన అంశాలను టార్గెట్ చేస్తూ జైలు నుంచే లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన రాసిన లేఖ అందరి దృష్టిని ఆకర్షించింది.