ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 మే 2021 (19:49 IST)

ఎల్టీటీఈ టెర్రరిస్ట్‌గా సమంత.. ది ఫ్యామిలీ మ్యాన్ 2పై తమిళ తంబీల ఫైర్

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ ట్రైలర్‌పై తమిళులు ఫైర్ అవుతున్నారు. తమిళులకు వ్యతిరేకంగా సిరీస్ తీశారని తిట్టిపోస్తున్నారు. సమంత పాత్ర వాళ్ళకు నచ్చలేదు. దాంతో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోకు నష్టాలు తప్పదని ట్వీట్లు చేస్తున్నారు. 
 
ఇందులో సమంతను ఎల్టీటీఈ టెర్రరిస్ట్‌గా చూపించడంపై తమిళ నెటిజన్లు 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్, ప్రైమ్ వీడియో మీద మండిపడుతున్నారు. #FamilyMan2_against_Tamils హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్ ప్లేస్‌లో వుంది. ప్రైమ్ వీడియోను అన్ సబ్‌స్క్రైబ్ చేస్తున్నట్టు కొందరు ట్వీట్లు చేశారు. ఇంకొందరు ఓ స్ట్రాటజీ ప్రకారం తమిళులపై కుట్ర జరుగుతోందని అభిప్రాయపడ్డారు.
 
సమంత సినిమాలను బాయ్‌కాట్ చేస్తామని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. సమంత తమిళ యాసపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ట్రైలర్‌కు వస్తున్న వ్యతిరేకతపై సమంత స్పందించడం లేదు. తమిళనాడులో సెంటిమెంట్లు బలంగా వుంటాయి. పైగా, సమంత తమిళ అమ్మాయి. ఆమెకు తెలియనిది కాదు. తమిళ సెగపై ఎలా స్పందిస్తారో చూడాలి.