సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2024 (17:34 IST)

డైమండ్ వాచ్‌తో ఫోజులిచ్చిన సమంత.. ధర అక్షరాలా రూ.70లక్షలు?

Samantha
సెలెబ్రిటీలు భారీ ఖరీదైన వస్తువులు ధరించడం మామూలే. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ఖరీదైన వాచ్ ధరించాడు. ఆ ఫోటోతో పాటు ఆ వాచ్ ధరెంత అనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. 
 
తాజాగా హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఖరీదైన వాచ్ ధరించి కొత్త చర్చకు తెరలేపింది. ప్రస్తుతం మయోసైటిస్ కారణంగా సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన సమంత.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. ఆరోగ్యానికి సంబంధిత సూచనలు చేయడం ద్వారా వీడియోలు పోస్టు చేయడం.. అలాగే లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ట్రీట్ ఇస్తోంది. 
 
ఖచ్చితమైన ఫోటోషూట్‌ల ద్వారా, ఆమె తన చరిష్మా, ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. తాజాగా బల్గారీ సర్పెంటి డైమండ్ వాచ్‌ ధరించిన సమంత ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వాచ్ ఖరీదు రూ.70లక్షలు వుంటుందని అంచనా. ఇకపోతే.. సమంతా తన రాబోయే సిరీస్ 'సిటాడెల్' ద్వారా సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తుందని టాక్ వస్తోంది.