ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (13:07 IST)

పెళ్లెందుకు చేసుకోవాలి అంటున్న సంయుక్త !

Samyukta
Samyukta
హీరోయిన్లు సినిమాల్లో హీరోను ప్రేమించి పెండ్లి చేసుకుంటారు. ఇంతకుముందు భీమ్లానాయక్‌లో రాణాకు జోడీగా నటించిన సంయుక్త మీనన్‌ ఇప్పుడు ధనుష్‌తో ‘సార్‌’ సినిమా చేస్తుంది. టీచర్‌గా నటిస్తోంది. ఈ సినిమానుంచి తన పేరులో చివరలో మీనన్‌ తీసేసి సంయుక్తగా మార్చుకుంది. తెలుగును 17 డేస్‌లోనే నేర్చుకున్న సంయుక్తకు కన్నడ, తమిళం కూడా తెలుసు. ఇక నటిగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న ఆమెను ఫీచర్‌లో ఎరేంజ్ మేరేజా,  లవ్‌ మేరేజా అని ప్రస్తావన తెస్తే ఏమందో తెలుసా!
 
పెండ్లి చేసుకోవాలంటే నా ఆలోచనలకు సరైన వ్యక్తి దొరకాలి. నన్ను ప్రేమగా చూసుకొనేవాడు కావాలి. నా ఎమోషన్స్‌ గౌరవించాలి. అన్ని విధాలుగా నచ్చితే చూద్దాం. ప్రస్తుతానికి ఆ ఆలోచనలేదు. ఇటీవలే ఇంటర్వ్యూ లో  కొందరు యాంకర్లు కూడా పెండ్లి గురించి అడిగారు. చాలామంది యువత పెండ్లి అవసరమా! అనే ఆలోచనను కొందరు మహిళలు చెబుతున్నారని దానిపై నన్ను మాట్లాడమన్నారు. మహిళ కుటుంబంలో ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఇంటిపని చేస్తుంది. జాబ్‌ చేస్తుంది. అలాంటి ఆలోచనలు వున్న వారి విధానం వేరేగా వుంటుందని తెలిపింది. పార్టనర్‌ సరైనవాడు దొరికితేనే మహిళ సేఫ్‌గా వుంటుంది. లేదంటే పెండ్లిమీదే అసహనం ఏర్పడుతుంది అని క్లారిటీ ఇచ్చింది.