శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : సోమవారం, 5 ఆగస్టు 2019 (18:55 IST)

పవర్ స్టార్‌తో శర్వానంద్ సెల్ఫీ... ఇంత‌కీ ఎప్పుడు తీసుకున్నాడు..? (video)

ఒకరేమో టాలీవుడ్ పవర్ స్టార్, మరొకరేమో యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న క్రేజీ హీరో. ఇక ఈ ఇద్దరు కలిస్తే ఇక వారిద్దరి ఫ్యాన్స్‌కు ఎంతో సంబరం అనే చెప్పాలి. అయితే వారిద్దరూ మరెవరో కాదండి, ఒకరు పవన్ కళ్యాణ్ గారైతే మరొకరు శర్వానంద్. 
 
నిజానికి వారిద్దరూ కలిసి ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించినప్పటికీ, నేడు శర్వానంద్, పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్‌లోని ఎయిర్ పోర్ట్‌లో అనుకోకుండా కలవడంతో, ఆ వండర్‌ఫుల్ మూమెంట్‌ని తన ఫోన్లో సెల్ఫీ ద్వారా బంధించి, దానిని తన ఫ్యాన్స్ కోసం షేర్ చేసారు. 
 
ఇక ఈ ఫోటోను చూసిన పలువురు పవన్ ఫ్యాన్స్ మరియు శర్వా ఫ్యాన్స్, భవిష్యత్తులో కుదిరితే వారిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించాలని కోరుకుంటూ ఆనందంతో తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఆ ఫోటోను షేర్ చేస్తూ సంతోషపడుతున్నారు.