మా అమ్మ జయంతి వేడుకలకు ఆహ్వానిస్తున్నాం.. సావిత్రి కుమారుడు
మా అమ్మ డా.సూర్యకాంతం శత జయంతి సందర్భంగా ప్రారంభ వేడుకలు నవంబరు 5, 2023లో చెన్నైలో భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని, "ఆంధ్రుల అభిమాన అత్తగారు" పుస్తక ఆవిష్కరణతో అంగరంగ వైభవంగా జరిగిన విషయం మీకు తెలిసిందే. తర్వాత అంటే సెప్టెంబర్ 11 వ తేదిన శతజయంతి వేడుకల్లో భాగంగా నరవ ప్రకాశ రావు సహకారంతో పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అధ్యక్షతన విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం, హిందీ విభాగం సెమినార్ హాల్ నందు ఘనంగా జరిగింది.
త్వరలో అంటే 2024 అక్టోబర్ 13 (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు ఆత్మీయ మిత్రులు జానకిరామ్ చౌదరి సహకారంతో "ది యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్" కాకినాడ వారి ఆధ్వర్యాన సంస్థ అధ్యక్షులు దంటు భాస్కరరావు సహాయ సహకారాలతో దంటు కళాక్షేత్రం, కాకినాడలో మరొక 'శతజయంతి' కార్యక్రమం జరగబోతోంది. తాను, తన కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా పాల్గొనే ఈ కార్యక్రమానికి మీరందరూ రావాలని, మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్టు సావిత్రి దత్తపుత్రుడు డాక్టర్ అనంతపద్మనాభ మూర్తి విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.