ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 ఆగస్టు 2024 (16:18 IST)

బాలయ్య నట ప్రస్థానానికి 50 యేళ్ళు.. చిరంజీవికి ఆహ్వానం!!

chiranjeevi
సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నట ప్రస్థానానికి 50 యేళ్లు. 1974లో తాతమ్మ కల అనే చిత్రంలో బాలయ్య తన సినీ కెరీర్‌ను ప్రారభించారు. అప్పటి నుంచి వందలాది చిత్రాలు. భారీ సంఖ్యలో అవార్డులతో కలర్ ఫుల్ బాలయ్యగా మారిపోయారు. దీంతో సెప్టెంబరు ఒకటో తేదీన హైదరాబాద్ నగరంలో బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకలను నిర్వహిచనున్నారు. 
 
ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు రావాలంటూ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, డైరెక్టర్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రతినిధులు చిరంజీవిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశాయి. 
 
ఇకపోతే, 50 యేళ్ల బాలకృష్ణ సినీ చరిత్రలో ఆయన అందుకున్న అవార్డులు చూస్తే చాంతాడంత ఉంది. మూడు నంది అవార్డులు, ఏడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, ఒక సైమా అవార్డు, మూడు సంతోషం అవార్డులు, మూడు టి.సుబ్బిరామిరెడ్డి పురస్కారాలు, ఇలా చెప్పుకుంటూ పోతే బాలకృష్ణ అవార్డుల జాబితా చాలానే ఉంది.