తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆశిస్తున్నాం : తెలుగు సినీ, మీడియా
prasanna kumar, damodar prasad, parvataneni rambaabu, YJR and others
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఆ అపూర్వ విజయాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు. తెలుగు సినీ, మీడియా అభిమానులు. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి నిర్మాతలు టి ప్రసన్నకుమార్, దామోదర ప్రసాద్, టీవీ 5 ఎంటర్ టైన్ మెంట్ ఎడిటర్ వైజే రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, బాణా సంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత టి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ - ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగు దేశం, జనసేన, బీజేపీ కూటమి అపూర్వ విజయాన్ని సాధించడం ఆనందంగా ఉంది. కూటమి నేతలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కల్యాణ్ గారు, బీజేపీ నేతలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం సంతోషంగా ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లో ఎంతో అభివృద్ధి చెందింది. ఇప్పుడున్న ఎఫ్ఎన్ సీసీ ఏర్పాటు చేసింది కూడా చంద్రబాబు గారే. గత ఐదేళ్లుగా నంది అవార్డుల కార్యక్రమాలు నిలిచిపోయాయి. చంద్రబాబు గారు సీఎంగా పదవి చేపట్టాక మళ్లీ నంది పురస్కారాలు ఇవ్వాలని ఆశిస్తుంన్నా.. పర్వతనేని రాంబాబు ఆద్వర్యంలొఈ కార్యక్రమం జరగటం చాలా ఆనందంగా వుంది. గెలిచిన NTR కుటుంబ సభ్యులందరికి శుభాకాంక్షలు. కొత్త ప్రభుత్వానికి స్వాగతం చెబుతున్నాం అన్నారు.
ని
ర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ - ఏపీ ఎన్నికల్లో కూటమి నేతలకు ఈసారి ఏపీ ఎన్నికల్లో ఘన విజయం దక్కింది. చంద్రబాబుగారు, పవన్ గారు, బీజేపీ నేతలకు శుభాకాంక్షలు. మంచి పరిపాలనతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కొత్త ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఆశిస్తున్నాం. అన్నారు.
టీవీ 5 ఎంటర్ టైన్ మెంట్ ఎడిటర్ వైజే రాంబాబు మాట్లాడుతూ - ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగు దేశం, జనసేన, బీజేపీ కూటమి అపూర్వ విజయాన్ని సాధించడం ఆనందంగా ఉంది. కూటమి నేతలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కల్యాణ్ గారు, బీజేపీ నేతలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూటమి ఆధ్వర్యంలోని కొత్త ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది కోరుకుంటున్నా. అన్నారు.
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ - మంచి వారికి మంచే జరుగుతుంది అన్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చారు. మంచి వారికి పట్టం కట్టారు. కూటమికి చిరస్మరణీయ విజయాన్ని అందించారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా మరోసారి గెలుపొందడం సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారితో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారికి, బాలయ్య బాబు గారికి, బీజేపీ నేతలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సినీ పరిశ్రమకు, సినీ పాత్రికేయులకు సంక్షేమాలు అందిస్తుందని, అందరి అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడటం ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి సహకరించిన సినీ పెద్దలకు మా మీడియా మిత్రులకు కృతజ్నతలు అన్నారు.