Dude: ప్రదీప్ రంగనాథన్ పాన్ ఇండియా ఫిల్మ్ డ్యూడ్ నుంచి బాగుండు పో రిలీజ్

డీవీ
శనివారం, 20 సెప్టెంబరు 2025 (18:07 IST)
Pradeep Ranganathan
వరుస బ్లాక్‌బస్టర్‌ విజయాలతో దూసుకుపోతున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ పాన్ ఇండియా మూవీ డ్యూడ్‌తో అలరించడానికి రెడీ అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. 
 
'ప్రేమలు' అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. రీసెంట్‌‍గా రిలీజైన ఫస్ట్ సింగిల్ బూమ్ బూమ్‌ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మేకర్స్ సెకండ్ గేర్ బాగుండు పో సాంగ్‌ని రిలీజ్ చేశారు. 
 
ప్రదీప్ రంగనాథన్ తను ప్రేమించిన అమ్మాయి ఛాయిస్‌ని రెస్పెక్ట్ చేస్తూ తన లవ్ ఫీలింగ్స్‌ని ప్రజెంట్ చేసే ఈ సాంగ్ ని సాయి అభ్యాంకర్ హార్ట్ టచ్చింగ్ మెలోడీగా కంపోజ్ చేశారు. సంజిత్, సాయి అభ్యాంకర్ వోకల్స్ అద్భుతంగా వున్నాయి. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం మనసుని హత్తుకునేలా వుంది. 
 
వినగానే కనెక్ట్ అయ్యే ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్‌, లతా నాయుడు ప్రొడక్షన్ డిజైనర్. భరత్ విక్రమన్ ఎడిటర్. ఈ దీపావళికి డ్యూడ్ కలర్‌ఫుల్, మ్యూజిక్‌తో కూడిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కానుంది.

అన్నీ చూడండి

బ్రిటీష్ మహిళ మెదడులో పరాన్నజీవులు - పదేళ్ళపాటు జీవితం నరకప్రాయం

నీట్ యూజీ రీ-ఎగ్జామ్ ప్రొవిజనల్ కీలపై 10 వేల అభ్యంతరాలు.. ఫలితాలు ఎపుడంటే?

డేకేర్‌లో చిన్నారులకు అమానుష శిక్షలు - నోట్లోకి టాయిలెట్ జెట్ స్ప్రేతో నీళ్లు

ఈవ్‌టీజింగ్ చేశాడని చెంపదెబ్బ.. అంతే అక్కాచెల్లెళ్లపై పదునైన ఆయుధాలతో దాడి

గోవాలో తెలంగాణ వ్యక్తి అరెస్ట్.. మహిళను స్కూటర్‌పై కూర్చోబెట్టుకుని?

అన్నీ చూడండి

క్యాల్షియం మాత్రలు అన్నం తిన్నాక ఎంత గ్యాప్ తీసుకుని వేసుకోవాలి?

వైద్యుని సలహా లేకుండా వేసుకునే మందులతో కాలేయం ఏమవుతుందో తెలుసా?

రక్తం వృద్ధి చేసే అద్భుత ఆహారాలు

పద్మభూషణ్ డా. నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్

అధికంగా పసుపు వాడితే?

తర్వాతి కథనం
Show comments