సెంటిమెంట్‌గా ఖైదీ నెం.786 డ్రెస్ ధరించిన మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం.786 ఎంతటి హిట్టో తెలిసిందే. విజయ బాపినీడు దర్శకత్వంలో 1988లో విడుదలైన చిత్రం. ఇందులో చిరంజీవి, స్మిత, భానుప్రియ ముఖ్యపాత్రలు పోషించారు. రాజ్ - కోటి సంగీతం అందించారు. ఈ సినిమాను మాగంటి రవీంద్రనాథ్ చౌదరి శ్యాం ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై నిర్మించగా గీతా ఆర్ట్స్ సంస్థ పంపిణీ చేసింది.
విశ్వసనీయ సమాచారం మేరకు, తాజాగా మెగాస్టార్ అప్పటి ఖైదీ నెం.786 డ్రెస్‌ను తలపించేలా లూసీఫర్ సినిమా కోసం ధరించారు. కథ ప్రకారం చిరంజీవిని జైలులో బంధిస్తారు. ఆ సందర్భంగా 786 నెంబర్ గల దుస్తులు ఆయన ధరించారు. అప్పట్లో ఎంతో ఎమోషనల్‌గా ఆయన ఖైదీ పాత్రకోసం డైలాగ్‌లు చెబితే, ఇప్పుడు ఈ లూసీఫర్ కోసం పరిణిత చెందిన వయస్సుగల పాత్ర కనుక చాలా స్టయిలిష్‌గా సంభాషణలు పలికించారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ శివార్లో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ వేసిన జైలు సెట్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ డ్రెస్ చూసిన చిత్ర యూనిట్ మెగాస్టార్ అప్పటికీ ఇప్పటికీ పెద్ద మార్పులేదని కితాబిచ్చేస్తున్నారు. తన ఆరోగ్యాన్ని ఆ విధంగా కాపాడుకుంటూ వచ్చిన చిరంజీవి ఈ లూసీఫర్‌తో ఎంత క్రేజ్ తెచ్చుకుంటారో చూడాలి.
మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మెగా సూపర్‌గుడ్ ఫిలింస్, ఎన్‌విఆర్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మోహన్‌లాల్ నటించిన మలయాళ లూసీఫర్‌కు ఇది రీమేక్.