శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 23 ఆగస్టు 2021 (10:25 IST)

ఆచార్య గురించి ఏమీ చెప్ప‌లేద‌న్న చిరు అభిమానులు

charan-ntr
ఎన్టీఆర్ వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్నటీవీ షో `ఎవరు మీలో కోటీశ్వరులు`. ఆదివారంనాడే ప్రారంభం అయింది. ప్రోమోలో రామ్‌చ‌ర‌ణ్ గెస్ట్‌గా వ‌స్తున్న‌ట్లు తెలిసిందే. ఈ మేరకు రామ్ చరణ్ కి జూనియర్ ఎన్టీఆర్ పలు ప్రశ్నలను సంధించారు. లోకంలోని విష‌యాలు అడుగుతూ ఆచార్య సినిమాకు సంబంధించిన విష‌యాలు ఎన్‌.టి.ఆర్‌. అడిగాడు. 
 
పైగా చిరు బ‌ర్త్‌డేరోజు కావ‌డంతో ఆచార్య గురించి ఏమి చెబుతాడో అని అభిమానులు ఎదురు చూశారు. ఆచార్య చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది అంటూ రామ్ చరణ్ ను ఎన్టీఆర్ అడగగా, నాన్న తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా మెమరబుల్ మూమెంట్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు కొరటాల శివ గారికి థాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు.
దీనికి ఎన్టీఆర్ సంతోషం వ్యక్తం చేస్తూ, మేమందరం ఆచార్య కోసం ఎదురు చూస్తున్నాం అని అన్నారు.  అయితే రొటీన్‌గా చెప్పిన‌ట్లు చర‌ణ్ చెప్ప‌డం అభిమానుల‌ను నిరాశ‌ప‌రిచింది. ఇంకా ఏదో కొత్త విష‌యం చెబుతాడ‌ని అనుకున్నామ‌ని సోష‌ల్‌మీడియాలో చ‌ర‌ణ్‌కు పోస్ట్ చేశారు. మ‌రికొన్ని ఫంక్ష‌న్లు వున్నాయంటూ రీట్వీట్ చేశాడు.