శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (10:10 IST)

మంచితనానికి మారుపేరు కృష్ణంరాజు : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య

anushka shetty
మంచితనానికి మారుపేరు కృష్ణంరాజు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.  ఆదివారం వేకువజామున మృతి చెందిన సినీ నటుడు కృష్ణంరాజు మృతిపై ఆయన స్పందించారు. 
 
"కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ చలనచిత్ర నటులు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు పరమపదించడం అత్యంత విచారకరం. మంచితనానికి మారుపేరుగా అనేకమంది అభిమానాన్ని సంపాదించుకున్న వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను. వ్యక్తిగతంగా మంచి ఆప్తుణ్ని కోల్పోవడం బాధాకరమైన విషయం" అంటూ ట్వీట్​ చేశారు.
 
అలాగే సీనియర్ హీరో మోహన్ బాబు స్పందిస్తూ, "సోదర సమానుడైన కృష్ణంరాజు మరణ వార్త విన్న తర్వాత మాటలు రావడం లేదు" అంటూ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ట్విట్టర్​ వేదికగా ఆయన ట్వీట్​ చేశారు. 
 
సినీ హీరోయిన్ అనుష్క శెట్టి తన ట్విట్టర్ ఖాతాలో సంతాపం తెలిపారు. "కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని, ఒక లెజండ్, విశాలహృదయుడు అయన కృష్ణంరాజు మా హృదయాల్లో జీవిస్తారని" పేర్కొన్నారు. 
 
"మా" అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు తన సంతాప సందేశంలో.. "గుండెపగిలిపోయింది. మా ఇంటి పెద్దను కోల్పోయాం" అంటూ పేర్కొన్నారు.