గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 జనవరి 2023 (13:34 IST)

ఆకట్టుకునేలా "పఠాన్" ట్రైలర్‌ - చెర్రీ చేతుల మీదుగా రిలీజ్

pathaan
బాలీవుడ్‌ స్టార్ హీరో షారూక్ ఖాన్ నటించిన తాజా చిత్రం "పఠాన్". ఇటీవల 'బ్రహ్మాస్త్ర' చిత్రంలో అతిథి పాత్రలో కనిపించిన ఆయన ఇపుడు పఠాన్ రూపంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే, ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ పెను దుమారాన్నే రేపింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటామని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను హీరో రామ్ చరణ్ మంగళవారం విడుదల చేశారు. ఈ నెల 25వ తేదీన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించింది.
 
అయితే, ఈ ట్రైలర్ విడుదలకాకముందే పఠాన్‌ బాయ్‌కాట్ పఠాన్ అంటూ నెట్టింట రచ్చ సాగింది. బేషరమ్ రంగ్ పాటలో దీపికా పదుకొనే వస్త్రాధారణపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీపికా కాషాయం రంగు బికినీ ధరించడం తీవ్ర స్థాయిలో దుమారం రేపింది. అయితే, తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. ఒక సైనికుడు తన దేశం కోసం ఏం చేశారన్న కథాంశంతో యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. జాన్ అబ్రహాం ప్రతి నాయకుడి పాత్రను పోషించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం.