బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 17 జులై 2018 (10:13 IST)

క‌ళ్ళ‌కు మందంగా కాటుక‌పెట్టి.. "జీరో" ఫస్ట్‌లుక్‌లో కత్రినా అదుర్స్

బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ - అనుష్క‌ శర్మ, కత్రినా కైఫ్‌లు జంటగా నటిస్తున్న చిత్రం "జీరో". ఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యేడాది ఆఖరులో ఈ చిత్రం ప్రేక్ష

బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ - అనుష్క‌ శర్మ, కత్రినా కైఫ్‌లు జంటగా నటిస్తున్న చిత్రం "జీరో". ఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యేడాది ఆఖరులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మరోవైపు, చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో సినిమా యూనిట్ బిజీబిజీగా గడుపుతోంది.
 
ఈనేపథ్యంలో క‌త్రినా కైఫ్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. క‌ళ్ళ‌కు మందంగా కాటుక‌పెట్టి డిఫ‌రెంట్ లుక్‌లో కత్రినా క‌నిపిస్తోంది. ఈ అమ్మ‌డి పిక్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. జీరో చిత్రానికి అజయ్‌ - అతుల్ సంగీతం అందించ‌గా, షారూక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్, ఆనంద్ ఎల్ రాయ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపికా పదుకొనే, శ్రీదేవి, రాణీ ముఖర్జీ, కాజోల్ తదితరులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో సూపర్ స్టార్ పాత్రను కత్రినా పోషిస్తుంటే, దివ్యాంగురాలి పాత్రలో అనుష్క శర్మ నటిస్తోంది.