మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 8 మే 2017 (14:42 IST)

షాహిద్ కపూర్ భార్య గ్రేట్.. చేసిన తప్పుకు సైలెంట్‌గా.. రూ.2వేలు చెల్లించి వెళ్లిపోయింది..

బాలీవుడ్‌ హీరోయిన్లపై తెప్పిపొడుపు వ్యాఖ్యలు చేసిన నటుడు షాహిద్‌ కపూర్‌ వైఫ్ మీరా రాజ్‌పుత్‌ మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. గతంలో మహిళా దినోత్సవ సందర్భంగా షాహిద్ కపూర్ సతీమణి మీరా రాజ్ పుత్.. పిల్లల భవ

బాలీవుడ్‌ హీరోయిన్లపై తెప్పిపొడుపు వ్యాఖ్యలు చేసిన నటుడు షాహిద్‌ కపూర్‌ వైఫ్ మీరా రాజ్‌పుత్‌ మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. గతంలో మహిళా దినోత్సవ సందర్భంగా షాహిద్ కపూర్ సతీమణి మీరా రాజ్ పుత్.. పిల్లల భవితవ్యం కోసం మహిళలు ఇంటికి అతుక్కుపోతే తప్పులేదన్న విధంగా మాట్లాడింది.

తన పిల్లలతో గడిపే క్షణాలను చేజార్చుకోనని.. వారిని కంటిలో పెట్టుకుని కాపాడుకుంటానని.. ఇందుకోసం వారి వెంటే వుంటానని.. ఉద్యోగాలకు తాను దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది. అందంతో పాటు తెలివితేటలున్నప్పటికీ షాహిద్ సతీమణి అణకువతో మెలుగుతోందని బిటౌన్‌లో మంచి పేరుంది. తాజాగా మీరా రాజ్ పుత్ చేసిన తప్పుకు సైలెంట్‌గా ఫైన్ కట్టి వెళ్లిపోయింది. 
 
అసలేం జరిగిందంటే.. ఆదివారం ముంబైలోని బాంద్రా ప్రాంతంలోవున్న కిచెన్‌ గార్డెన్‌ రెస్టారెంట్‌కి వెళ్లింది షాహిద్‌కపూర్ జంట. కారుని ఆమె నో పార్కింగ్‌ జోన్‌లో పెట్టడంతో మీరాకు రూ. 2000 జరిమానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. అయితే మిగిలిన సెలెబ్రిటీల్లా ట్రాఫిక్ పోలీసులతో వాగ్వివాదానికి దిగలేదు.

సైలెంట్‌గా జరిమానా కట్టి వెళ్లిపోయింది. చాలామంది సెలెబ్రిటీలు ట్రాఫిక్స్ రూల్స్ అతిక్రమించి తమతో వాగ్వావాదానికి దిగిన సందర్భాలున్నాయని.. అయితే మీరా చేసిన తప్పును తెలుసుకుని జరిమానా చెల్లించినట్టు పోలీసులు తెలిపారు.