గురువారం, 6 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 మార్చి 2025 (13:12 IST)

కుమార్తెతో గొడవపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సింగర్ కల్పన!

kalpana
ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యకు గల కారణం వెల్లడైంది. కుమార్తెతో గొడవ పడటం వల్లే ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం. మంగళవారం కుమార్తెకు ఫోన్ చేసి కల్పిన ఆమె హైదరాబాద్ రావాలని కోరింది. అయితే, కేరళలోనే ఉంటానని, హైదరాబాద్ నగరానికి రానని తెగేసి చెప్పినట్టు చెప్పింది. ఈ విషయంపై ఫోనులో తల్లీ కుమార్తెల మధ్య వాగ్వాదం జరిగినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కుమార్తెతో గొడవపడి మనస్తాపం చెందిన కల్పన, మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. 
 
సాయంత్రం 4.30 గంటలకు చెన్నై నుంచి భర్త ప్రసాద్ ఫోన్ చేయగా కల్పన లిఫ్ట్ చేయలేదు. పలుమార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో విల్లా సెక్రటిరికి కాల్ చేసి చెప్పానని, ఆయన వెళ్లి తలుపు తట్టినా తెరవలేదని ప్రసాద్ వివరించారు. దీంతో పోలీసులకు సమాచారం. అందించగా వారు వచ్చి తలుపులు బద్దలు కొట్ట లోపలకు వెళ్లారని, బెడ్ రూంలో అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను హటాహుటిన ఆస్పత్రి తరలించారని ఆయన తెలిపారు.