గురువారం, 9 ఫిబ్రవరి 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated: గురువారం, 24 నవంబరు 2022 (14:31 IST)

శ్రీహాన్‌ను కౌగిలించుకున్న సిరి.. ఈమె ఎవరు..?

Siri Hanumanth
Siri Hanumanth
తెలుగు బిగ్ బాస్ ఐదో సీజన్ కంటిస్టెంట్, శ్రీహాన్ స్నేహితురాలు సిరి హనుమంత్ బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ హౌస్ లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా శ్రీహాన్‌కు ప్రేమతో పలకరించింది. కౌగిలించుకుంది. సిరి తన నలుపు రంగు చీరలో చాలా అందంగా ఉంది. ఆమె అందమైన చిరునవ్వు ఆమె అందాన్ని పెంచింది.  
 
తర్వాత సిరి శ్రీహన్‌కి అతని పేరు మీద వున్న టాటూను చూపించింది. అతను ఆశ్చర్యపోయి ఆమెను కౌగిలించుకున్నాడు. తన తల్లిదండ్రులను చూసుకోమని సిరిని అడుగుతున్నప్పుడు శ్రీహన్ ఉద్వేగానికి లోనయ్యాడు. వారికి క్రమం తప్పకుండా ఫోన్ చేయమని కోరాడు. 
 
సుదీప తన భర్త ఫోటో, టీ-షర్ట్ ఇవ్వమని బిగ్ బాస్‌ని కోరింది. తన తండ్రి గురించి పంచుకుంటూ సూర్య భావోద్వేగానికి గురయ్యాడు.