సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2022 (11:29 IST)

లవ్ ట్రాక్ కుదరలేదు.. బిగ్‌బాస్‌కే చుక్కలు.. ఇనయా విషయం సక్సెస్ అయ్యాడుగా!

Inaya_Surya
Inaya_Surya
బిగ్ బాస్‌కు ఆరో సీజన్‌లో కంటిస్టెంట్లు కాస్త టఫ్ ఇస్తున్నారనే చెప్పాలి. లావ్ ట్రాక్ నడపాలని ఎంతగా ట్రై చేస్తున్నా.. బిగ్ బాస్ వల్ల కావట్లేదు. ఎవ్వరైనా కొంచం క్లాజ్‌గా మూవ్ అయితే చాలు.. హైలైట్ చేద్దామనుకుంటే బిగ్ బాస్ పప్పులు వుడకట్లేదు. 
 
ఆరో సీజన్‌లో లవ్‌ట్రాక్‌లు నడిపేందుకు బిగ్‌బాస్‌ నానా తిప్పలు పడుతున్నాడు. అర్జున్‌-శ్రీసత్యలను కలిపేందుకు ప్రయత్నించాడు. కానీ అది కాస్త ప్లాఫ్ అయ్యింది. శ్రీసత్య నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ రాలేదు. ఇక షో ప్రారంభంలోనే ఆర్జే సూర్య, ఆరోహి రావుల మధ్య లవ్‌ ట్రాక్‌ నడిపించే ప్రయత్నం చేశాడు. అదీ కొనసాగలేదు.  
 
సూర్యకి బయట బుజ్జమ్మ అలియాస్‌ మృదుల అనే గర్ల్‌ఫ్రెండ్‌ ఉందని, ఆమెతో పదేళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తున్నానని సూర్య పదే పదే చెప్పడంతో బిగ్‌బాస్‌ ప్లాన్‌ వర్కౌట్‌ కాలేదు.
 
ఆరోహి వెళ్లాక ఇనయాను టార్గెట్‌ చేశాడు. నాగార్జునతో పదేపదే పొద్దు తిరుగుడు పువ్వు అని చెప్పిస్తూ.. వారిద్దరి మధ్య ప్రేమను పుట్టించేందుకు ప్రయత్నించాడు. అయితే ఇదంతా తనకు ప్లస్‌ అవుతుందని భావించిన సూర్య.. ఇనయాతో క్లోజ్‌గా మూవ్‌ అవుతూనే.. అప్పుడప్పుడు 'బుజ్జమ్మ'మ్యాటర్‌ తెస్తున్నాడు. 
 
ఇక ఇనయా కూడా తమ ఫ్రెండ్‌షిప్‌ మ్యాటర్‌ బిగ్‌బాస్‌ ఎటో తీసుకెళ్తున్నాడని గ్రహించి, దూరంగా ఉండి గేమ్‌ ఆడేందుకు సిద్ధమైంది. సోమవారం నామినేషన్స్‌లో ఏకంగా సూర్యతో గొడవకు కూడా దిగింది. దీంతో సూర్య, ఇనయాల విషయంలో కూడా బిగ్‌బాస్‌ ప్లాన్‌ వర్కౌట్‌ కాలేదని అంతా భావించారు. కానీ నిన్నటి ఎపిసోడ్‌తో ఎట్టకేలకు తాను విజయం సాధించానని నిరూపించాడు బిగ్‌బాస్‌.
 
ఇనయా నిజంగానే సూర్యతో ప్రేమలో పడిపోయింది. తనను దూరం పెట్టడం భారంగా ఉందంటూ మెరినాతో చెబుతూ ఎమోషనల్‌ అయింది. సూర్య అంటే ఎక్కువ ఇష్టమా? స్నేహితుడి కంటే ఎక్కువనా? అని మెరినా అడిగిన ప్రశ్నకు.. 'అవును' అని సమాధానం ఇచ్చింది ఇనయా. బాధ ఎక్కువైపోయిందని.. మనసంతా భారమైపోయిందంటూ చెప్పుకొచ్చింది. 
 
సూర్య స్నేహితుడి కంటే ఎక్కువ క్లోజ్‌ అయిపోయాడు. కానీ తప్పు కదా.. కొన్ని కొన్ని అక్కడి వరకు ఆపేస్తేనే లైఫ్‌కి చాలా బెటర్‌' అని ఇనయా చెప్పుకొచ్చింది. సూర్య లైఫ్‌లో బుజ్జమ్మ ఉందనే కారణంగా ఇనయా దూరంగా వున్నట్లు అర్థం చేసుకోవచ్చు.