కాశ్మీర్ నేపధ్యంలో శివకార్తికేయన్ అమరన్ దీపావళికి ఫిక్స్
రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) & సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ “అమరన్” 31 అక్టోబర్ 2024 ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. రాజ్‌కుమార్ పెరియసామి రైటింగ్, డైరెక్షన్ చేసిన ఈ చిత్రం కాశ్మీర్ నేపధ్యంలో యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతుంది.
ప్రిన్స్ శివకార్తికేయన్ 'అమరన్' లో మునుపెన్నడూ చూడని అవతార్, ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. సాయి పల్లవి స్క్రీన్‌ని పంచుకోవడం, సినిమాకు డీప్ ఎమోషన్స్ ని యాడ్ చేస్తోంది.
టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తోంది. జి వి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్, సినిమాటోగ్రాఫర్ సిహెచ్ సాయి, ఎడిటర్ ఆర్. కలైవానన్, అన్బరివ్ మాస్టర్స్‌తో పాటు స్టీఫన్ రిక్టర్ యాక్షన్ డైరెక్టర్లు గా వున్నారు.
ఉలగనాయగన్ కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ , గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించిన ఈ చిత్రం శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన “ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్” అనే పుస్తకంలోని “మేజర్ వరదరాజన్” చాప్టర్ ఆధారంగా రూపొందించారు.
2022 బ్లాక్‌బస్టర్ హిట్ "విక్రమ్" తర్వాత RKFI నుంచి వస్తున్న అమరన్ బౌండరీస్ దాటి దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.