ఆదివారం, 16 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 15 ఫిబ్రవరి 2025 (18:23 IST)

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

Sundeep Makthala and Baba Ramdev
హరిద్వార్: సమగ్ర ఆరోగ్య సంస్కృతికి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న టీకన్సల్ట్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ నెట్ వర్క్ (టిఐఎచ్ఎన్) ప్రస్థానానికి మరో గౌరవం దక్కంది. ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. నేచురోపతి నిపుణుడు డా. మంతెన సత్యనారాయణ రాజు, ఫార్మా దిగ్గజం డివిస్ ల్యాబొరేటరీస్ సహవ్యవస్థాపకుడు డివి మాధుసూదన్ రావు తదితర ప్రముఖులు ప్రశంసించిన అనంతరం, బాబా రామ్‌దేవ్ టీకన్సల్ట్ విజన్‌ను అభినందిస్తూ, ఆయుర్వేదం, నేచురోపతి, హోమియోపతి, అల్లొపతి మరియు హోలిస్టిక్ వెల్‌నెస్‌ను ప్రపంచవ్యాప్తంగా సమగ్రంగా అనుసంధానించడం భారతదేశాన్ని గ్లోబల్ హెల్త్ లీడర్‌గా తీర్చిదిద్దే విప్లవాత్మక అడుగు అని ప్రశంసించారు. 
 
హరిద్వార్‌లో టీకన్సల్ట్ ఛైర్మన్ సందీప్ కుమార్ మక్తాలాతో సమావేశమైన బాబా రామ్‌దేవ్, ప్రాచీన వైద్యపద్ధతులను ఆధునిక వైద్యానికీ అనుసంధానించే టీకన్సల్ట్ ప్రయత్నాన్ని ప్రశంసించారు. సమగ్ర వైద్య విధానాన్ని ప్రపంచానికి అందుబాటులోకి తేవడంలో భారతదేశం ముందుండాలని, అలాగే ప్రివెంటివ్, క్యురేటివ్, హోలిస్టిక్ ఆరోగ్య సంస్కృతిని కలిపే యూనిఫైడ్ హెల్త్‌కేర్ మోడల్ అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.
 
బాబా రామ్‌దేవ్ మాట్లాడుతూ, “భారతదేశం ఎప్పటి నుంచో సమగ్ర ఆరోగ్య సంస్కృతికి మార్గదర్శి. అయితే టీకన్సల్ట్ ఈ సంప్రదాయాన్ని ప్రపంచానికి చేర్చేందుకు ముందుకు సాగుతోంది. ఆధునిక వైద్యం, ఆయుర్వేదం, యోగ, నేచురోపతి కలయికతో గ్లోబల్ హెల్త్‌కేర్ రంగాన్ని పునర్నిర్వచించనుంది. సంప్రదాయం మరియు సాంకేతికత కలయికే భవిష్యత్, ఈ మహత్తర ప్రయత్నానికి నా సంపూర్ణ మద్దతు.” అని తెలియజేశారు.
 
ఈ సందర్భంగా టీకన్సల్ట్ ఛైర్మన్ సందీప్ మక్తాలా మాట్లాడుతూ, “మా లక్ష్యం ఆధునిక వైద్యం మరియు సంప్రదాయ వైద్య పద్ధతుల మధ్య అనుసంధానం సాధించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు సమగ్ర ఆరోగ్య సంస్కృతిని అందుబాటులోకి తేవడం. ఈ దిశగా మన వైద్య నిపుణులు, సంప్రదాయ వైద్యులు కలిసికట్టుగా పని చేయాలి. వ్యక్తిగతంగా దేశ వ్యాప్తంగా ప్రయాణిస్తూ ఆయుర్వేద, నేచురోపతి, హోమియోపతి నిపుణులతో కలిసి మా నెట్‌వర్క్‌ను విస్తరిస్తాను.” అని అన్నారు.“ఇది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. సమగ్ర ఆరోగ్య సంస్కృతి ప్రాధాన్యతను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు టిఐహెచ్ ఎన్ ఎంతో కీలకంగా మారనుంది. అందుకే అన్ని రంగాల ఆరోగ్య నిపుణులను, వెల్‌నెస్ ప్రాక్టీషనర్లను ఈ విప్లవాత్మక ప్రయాణంలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాను.” అని మక్తాలా పేర్కొన్నారు. టీకన్సల్ట్ గ్లోబల్ ప్రాప్యతకు నిదర్శనంగా, ఇటీవల డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆరోగ్య ఉపన్యాసం 13 భాషల్లో 60 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. టీకన్సల్ట్ అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత తక్షణ అనువాద సాంకేతికత ద్వారా ఇది సాధ్యమైంది. 
 
ఈ టెక్నాలజీకి బాబా రామ్‌దేవ్ హర్షం వ్యక్తం చేస్తూ, డిజిటల్ సాంకేతికతలు సంప్రదాయ వైద్యాన్ని ప్రపంచానికి అందుబాటులోకి తేవడంలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయో వివరించారు.ప్రస్తుతం 63 దేశాల్లో తన ప్రభావాన్ని చూపుతున్న టిఐఎచ్ఎన్, ప్రపంచవ్యాప్తంగా హాస్పిటల్స్, ఆరోగ్య నిపుణులు, సంప్రదాయ వైద్య విధానాలను పాటించే వ్యక్తులను తన నెట్‌వర్క్‌లోకి ఆహ్వానిస్తోంది. భారతీయ ఆరోగ్య సంపదను ప్రపంచానికి అందించడం ద్వారా, కేవలం ఆరోగ్య రంగానికే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థను కూడా మెరుగుపరిచే దిశగా టిఐహెచ్ ఎన్ పని చేస్తోంది.