మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (14:19 IST)

టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సోనుధి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ

Lakshmi Chaitanya, RU Reddy, Kitty Kiran
Lakshmi Chaitanya, RU Reddy, Kitty Kiran
టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు మరో నూతన నిర్మాణ సంస్థ భారీఎత్తున సినిమాలను నిర్మించటానికి సన్నద్ధం అవుతుంది. సోనుధి ప్రొడక్షన్‌ నెంబర్‌ 1 పేరుతో మార్చి 2 వ తేది 11.20 నిమిషాలకు ఆదివారం తమ మొదటి సినిమాను ప్రారంభిస్తున్నామని తెలియచేశారు. ఈ సందర్భంగా సోనుధి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థ అధినేత ప్రముఖ వ్యాపారస్థులు, రాజకీయ నాయకులు ఆర్‌.యు రెడ్డి మాట్లాడుతూ–‘‘ సోనుధి అంటే లక్ష్మీనరసింహ స్వామి సహస్ర నామంలోని ఒక నామం పేరు సోనుధి.  
 
మా మొదటి ప్రయత్నంగా   దర్శకులు కిట్టి కిరణ్, లక్ష్మీ చైతన్యల ద్వయాన్ని దర్శకులుగా మా బ్యానర్‌ నుండి పరిచయం చేయటం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. 2025లో అనేక సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వటానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. చిత్ర ప్రారంభంరోజున నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు తెలియచేస్తాం’’ అన్నారు.