మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (21:26 IST)

శ్రీజకు ఏమైంది.. ఎందుకలా పోస్టు చేసింది.. వెకేషన్‌లో ఎమోషనల్..

Srija
Srija
మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ మూడో వివాహం చేసుకోనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా శ్రీజ చేసిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. 
 
శ్రీజకు ఏమైందో ఏమో గానీ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు పెట్టింది. ఫ్యామిలీ గురించి పోస్టు చేసింది. ఇటీవల ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్‌తో వెకేషన్స్‌కి వెళ్లిన శ్రీజ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. అంతేగాకుండా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్టు పెట్టింది. 
 
తనకు కష్ట సుఖాల్లో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వెల్లడించింది. తాను కోపంలో వున్నప్పుడు నవ్వించిన వ్యక్తులకు.. ఏడుస్తున్నప్పుడు భుజం తట్టిన వారికి.. తాను ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తూ వచ్చి.. కొండంత అండగా నిలిచిన ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఇలాంటి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ దొరికినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని శ్రీజ పేర్కొంది. శ్రీజ చేసిన ఈ ఎమోషనల్ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sreeja (@sreejakonidela)