శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 అక్టోబరు 2019 (14:59 IST)

మంజువారియర్ ఆరోపణలు.. శ్రీకుమార్ స్పందన.. ఏమన్నారంటే?

''కంప్లీట్ యాక్టర్'' మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ‘ఒడియన్‌’ సినిమా షూటింగ్‌ సమయంలో ఆ సినిమా డైరెక్టర్ శ్రీ కుమార్ మీనన్‌ తనను అసభ్యంగా దూషించాడని.. తనను ఎంతో మానసిక వేదనకు గురిచేశాడని మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణలపై శ్రీ కుమార్ స్పందించారు. 
 
మంజు వారియర్ క్లిష్ట పరిస్థితుల్లో వున్నప్పుడు తాను మాత్రమే ఆమెకు సాయం చేశానని.. ఆ విషయాన్ని ఆమె మరిచిపోకూడదన్నారు. తన వల్లే ఆమెకు చాలామందితో పరిచయాలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లగొడతాడని, ఆ తర్వాత చంపేస్తానని తాను బెదిరించినట్లు వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చారు. అంతేగాకుండా మంజువారియర్ ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి పోలీసులకు విచారణ కోసం సహకరిస్తాను.
 
విచారణలో తనకు, మంజు వారియర్‌కి మాత్రమే తెలిసిన ఎన్నో నిజాలను బయటపెడతానని సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు శ్రీకుమార్. ఇటీవల మంజు వారియర్, ధనుష్‌తో నటించిన ‘అసురన్’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పటికే ఆమె భర్త దిలీప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల్లో కేసు నమోదైన విషయం తెలిసిందే.