బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 అక్టోబరు 2019 (12:34 IST)

హోటల్ గదిలో డాక్టర్‌పై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం... ఎవరతను?

బీజేపీ నేతలకు నోటి దురుసు మాత్రమే కాకుండా.. చేతి దురుసు కూడా ఎక్కువనేందుకు ఇంతకుముందు జరిగిన కొన్ని ఘటనలు నిదర్శనం. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు నమోదు అయ్యింది. తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని.. ఓ డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన అరుణాచల్ ప్రదేశ్‌లోని బామెంగ్‌‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బామెంగ్ ఎమ్మెల్యే గోరుక్ పొర్దండ్ ఇటానగర్‌లో‌ని ఓ హోటల్‌లో బస చేశారు. ఆయన్ని కలిసేందుకు హోటల్‌కు డాక్టర్‌ వెళ్లింది. అయితే హోటల్‌లో ఎమ్మెల్యే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలైన మహిళా డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
అయితే మహిళా డాక్టర్ తనపై చేస్తున్న అత్యాచార వార్తల్లో నిజం లేదని గోరుక్ కొట్టి పారేస్తున్నారు. తనను రాజకీయంగా ఎదగనివ్వకూడదనే ఉద్దేశంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తుందని వాపోతున్నారు. 
 
ఇకపోతే.. ఈ నెల 12వ తేదీన రాత్రి ఇటానగర్ హోటల్‌లో బీజేపీ ఎమ్మెల్యే మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై పోలీసులు విచారణ చేపట్టారు.