సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 27 ఏప్రియల్ 2019 (12:22 IST)

పవన్‌పై శ్రీరెడ్డి పరోక్ష వ్యాఖ్యలు.. ఒక్క వ్యక్తిని పెళ్లి చేసుకుని కొందరు మహిళలు?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై మళ్లీ శ్రీరెడ్డి విరుచుకుపడింది. ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొంతమంది మహిళలు బలైపోయారంటూ శ్రీరెడ్డి పరోక్షంగా పవన్‌పై కామెంట్లు చేసింది. తెలంగాణ పోరాటంలో ఎంతోమంది విద్యార్థులు బలిదానాలకు గురయ్యారు. ఆ సమయంలో ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు అని శ్రీరెడ్డి ప్రశ్నించింది. 
 
టాలీవుడ్‌‌లో టాప్‌కు చేరుకోవాల్సిన నటుడు ఓ ఫ్యామిలీ వల్ల ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఆ సమయంలో ధర్నా చేయాలని ఈ జనాలకు అనిపించలేదా అని శ్రీరెడ్డి పరోక్షంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసింది. తెలంగాణ విద్యార్థుల విషయంలో ప్రతిపక్షాలు, విద్యార్థుల తల్లిదండ్రులు చేస్తున్న ధర్నాలని తప్పుబట్టింది. 
 
విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో కేసీఆర్ గారిని ఎందుకు నిందిస్తున్నారు. ఇందులో ఆయన తప్పేముంది అని శ్రీరెడ్డి ప్రశ్నించింది. నరేంద్ర మోడీ పెద్ద నోట్లని రద్దు చేశారు. దానివలన ఎలాంటి ఉపయోగం జరగకపోగా దాదాపు నెలరోజుల పాటు కరెన్సీ కోసం అందరూ నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఈ తల్లిదండ్రులకు, ప్రతిపక్షాలకు మోడీకి వ్యతిరేకంగా ధర్నా చేయాలని అనిపించలేదా అని శ్రీరెడ్డి ప్రశ్నించింది.