మంగళవారం, 8 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 29 మార్చి 2023 (16:44 IST)

టైగర్ నాగేశ్వరరావు కోసం 5 ఎకరాల్లో స్టువర్టుపురం గ్రామం

tiger nageraro poster
tiger nageraro poster
రవితేజ కథానాయకుడిగా వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు' ఈ యేడాది విడుదల కాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్‌ లలో ఒకటి. కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 వంటి రెండు బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్‌ బస్టర్‌ లను అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ నిర్మాత అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో భారీ బడ్జెట్‌ తో ఆయన ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.  5 ఎకరాల స్థలంలో సినిమా కోసం స్టువర్టుపురం గ్రామాన్ని రిక్రియేట్ చేయడానికి భారీ బడ్జెట్‌ ను కేటాయించారు.
 
తాజాగా మేకర్స్ సినిమా విడుదల తేదిని అనౌన్స్ చేశారు. ఈ చిత్రం అక్టోబర్ 20 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల అవుతుంది. దసరా నుంచి టైగర్ నాగేశ్వరరావు బాక్సాఫీస్ వేట ప్రారంభమవుతుంది. దసరా బిగ్గెస్ట్ సీజన్ తో పాటు పర్వదినం. ఈ సినిమా లాంగ్ ఫెస్టివల్ హాలిడేస్ కలసిరానున్నాయి. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో టైగర్ నాగేశ్వరరావు గెటప్‌ లో పొగలు కక్కుతున్న రైలు పై నిలబడి కనిపించారు రవితేజ.
 
టైగర్ నాగేశ్వరరావు 1970 ల నేపథ్యంలో స్టూవర్టుపురంలోని గజదొంగ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. ఈ పవర్ ఫుల్ పాత్ర పోషించేందుకు రవితేజ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు. ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా సరికొత్త బాడీ లాంగ్వేజ్‌, యాసతో ఆకట్టుకుంటారు. ఈ సినిమాలో రవితేజ సరసన నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.