ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 24 మార్చి 2023 (14:35 IST)

యూత్ టార్గెట్ గా రేవ్ పార్టీ ప్రారంభోత్సవం

rave party opening
rave party opening
అసలు రేవ్ పార్టీలో ఏం జరుగుతుంది. ఆ పార్టీలో యూత్ ఎలా ప్రవర్తిస్తుంటారు. ఆ పార్టీలో యూత్ వాడే డ్రగ్స్ ఏంటీ, అవి ఎలా తీసుకుంటారు. ఈ రకమైన సంప్రదాయాన్ని పోలిటిషియన్స్ ఎందుకు ప్రొత్సహిస్తున్నారు. దాని వెనుక రాజకీయ నాయకుల అజెండా ఏమిటి అన్న విషయాలు, ఇలాంటి పార్టీల మూలంగా యువత జీవితంలో ఎలాంటి మలుపులు వస్తాయి అనే పాయింట్ తో రేవ్ పార్టీ రూపొందుతోంది. 
 
ఉడిపి, గోవా, మణిపాల్ లాంటి ప్రాంతాలలో ఎక్కువ ఈ రకమైన పార్టీలు జరుగుతుంటాయి, అందుకోసం ఈ చిత్రాన్ని ఆ ప్రదేశాలలోనే చీత్రికరించాడానికి షెడ్యూల్ ఖరారు చేస్తున్నట్లు దర్శకుడు రాజు బొనగాని చెప్పారు. సినిమా మొదలు పెట్టిన తరువాత ఏకదాటిగ చిత్రీకరణ పూర్తి చేసి ఇండియా వైడ్ గా అన్ని భాషల్లో బలమైన ప్రచారాన్ని చేయాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.
 
బోనగాని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజు బోనగాని దర్శకత్వ సారథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషలలో చీత్రికరన జరుపుకోవడానికి సిద్దం చేసుకొని ఉగాది సందర్భంగా అతిరథమహారదుల సమక్షంలో మార్చి 24 శుక్రవారం పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్, టైగర్ నాగెశ్వర్ డైరెక్టర్ వంశీ, మేజర్, గుఢాచారి డైరెక్టర్ శశికిరణ్ టిక్కా, యుఎఫ్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.  
 
ఈ చిత్రంతో క్రిష్ సిద్దిపల్లి హీరోగా నటిస్తున్నారు . ఇంకా ఈ సినిమాలో సుచేంద్ర ప్రసాద్, తారక్ పొన్నప్ప, ప్రతిమ తదితరలు నటిస్తున్నారు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫర్ గా వెంకట్ మన్నం, సంగీత దర్శకుడిగా దిలీప్ బండారి లు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదలైన పోస్టర్ అందరిలో గొప్ప ఆసక్తిని రేపుతుంది పోస్టర్లో డ్రగ్స్ పార్టీకి సంబంధించిన విజువల్స్ యూత్ ని అట్రాక్టివ్ ఆకర్షించే విధంగా పోస్టర్ డిజైనింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.
 
ఈ సందర్భంగా డైరెక్టర్ రాజు బొనగాని మాట్లాడుతూ.. కన్నడలో చిత్రీకరించిన తరువాత ఈ సినిమాను మిగితా భాషాలో పాన్ ఇండియా స్థాయిలో విడుదుల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సినిమా ఎప్రిల్ 3 నుంచి షూటింగ్ ప్రారంభించి వేగంగా ఒకే ఒక షెడ్యూల్ లో చిత్రాన్ని తెరకెక్కించాడనాకి అన్ని రకాల సన్నహాలు చేస్తున్నట్లు  తెలిపారు.
చిత్ర హీరో క్రిష్ సిద్దిపల్లి మాట్లాడుతూ.. తన శక్తికి మించి క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టి తెరపై ఇంకా ఉన్నతంగా కనిపించేలా నటిస్తానని తెలిపారు.