ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2022 (23:08 IST)

అనుపమ పరమేశ్వరన్ గురించి సుకుమార్ కామెంట్ ! (video)

Anupama Parameswaran, Sukumar
Anupama Parameswaran, Sukumar
అనుపమ పరమేశ్వరన్ గురించి అల్లు అరవింద్ అంతకుముందు,  ఇటీవలే మంచి కామెంట్ చేసారు. అనుపమ నాకు కుమార్తె లాంటిది. నాకు కుమార్తెలు లేరు. తన పెరఫార్మన్స్ చూస్తుంటే ముచ్చటేసింది అని తెలిపారు. 18 పేజెస్ ప్రమోషన్లో అల్లు అరవింద్ అన్న మాటలవి. మరి ఆ సినిమాను భాగస్వామ్యం అయిన డైరెక్టర్ సుకుమార్ కూడా ఓ నిజం చెప్పాడు. 18 పేజెస్ ప్రీ రిలీజ్ వేడుక లో ఆయన్న మాట్లాడారు. 
 
రంగస్థలం చిత్రాన్ని  రామ్ చరణ్ తో  సుకుమార్ చేసాడు. అసలు ఈ చిత్రంలో ముందుగా హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ చేయాల్సింది. కానీ సమంత హీరోయిన్ గా నటించింది. దానికి ఓ కారణం ఉంది.  అనుపమ పరమేశ్వరన్ ఆడిషన్ కు వచ్చింది. ఆడిషన్ చేస్తూ వాళ్ళ అమ్మ వైపు చూడటం మొదలు పెట్టింది. ఒకటి, రెండు సార్లు ఒకే. కానీ పదే పదే అల్లా జరగడంతో భయమేసి సమంత ను తీసుకున్నట్లు సుకుమార్ 18 పేజెస్ ప్రీ రిలీజ్ వేడుక లో తెలిపారు. సో, ఇలా కొన్ని పాత్రలు కొందరిని చేయనివ్వక పోవడానికి చిన్న కారణాలు కూడా కారణమ్ కావచ్చు.