బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 20 డిశెంబరు 2021 (21:44 IST)

స‌న్నీ సినీ అవ‌కాశాలు వ‌స్తున్నాయ్‌!

బిగ్ బాస్ రియాలిటీ షో ఐదవ సీజన్ ముగిసింది. ఈ షో లో సన్నీ టైటిల్ విజేత గా నిలిచిన సంగతి తెలిసిందే. సన్నీ టైటిల్ విజేత గా నిలవడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక అతనికి తన ఇంటి వద్ద ఘన స్వాగతం లభించింది.
 
తాజాగా నాగార్జున కూడా త‌న సినిమాలో అవ‌కాశం ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. తన ఆట తీరుతో ఆకట్టుకున్న సన్ని కి పలు సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. అంతేకాక స్టార్ మా లో ఒక టివి షో కి వ్యాఖ్యాత గా చేసే అవకాశం రావడం విశేషం.  బిగ్ బాస్ నుండి వెళ్లిన ఎంతోమంది పలు అవకాశాలు దక్కించుకున్నారు. అయితే వాటిని ఎలా స‌ద్వినియోగం చేసుకుంటారో చూడాలి మ‌రి.