గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 2 డిశెంబరు 2017 (11:48 IST)

సన్నీలియోన్ ఆ విషయంలో అదుర్స్: కానీ అందులో వరస్ట్

పోర్న్ కమ్ బాలీవుడ్ హీరోయిన్ అయిన సన్నీలియోన్ యాహూలో అధికంగా సెర్చ్ చేసిన హీరోయిన్లలో అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా బాలీవుడ్ భామలకు పోటీగా నిలిచింది. డిసెంబరుతో 2017 ఏడాదికి స్వస్తి చెప్పనున్న నేపథ్

పోర్న్ కమ్ బాలీవుడ్ హీరోయిన్ అయిన సన్నీలియోన్ యాహూలో అధికంగా సెర్చ్ చేసిన హీరోయిన్లలో అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా బాలీవుడ్ భామలకు పోటీగా నిలిచింది. డిసెంబరుతో 2017 ఏడాదికి స్వస్తి చెప్పనున్న నేపథ్యంలో యాహూ త‌మ సెర్చ్ ఇంజిన్‌లో నెటిజ‌న్లు అత్య‌ధికంగా సెర్చ్ చేసిన వారి జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలో అధికంగా సెర్చ్ చేసిన హీరోయిన్ల జాబితాను విడుదల చేసింది. 
 
యాహూలో అత్యధికంగా సెర్చ్ చేసిన భార‌త సినిమా హీరోయిన్లలో సన్నీలియోన్ అగ్రస్థానంలో వుండగా, తర్వాతి స్థానాలల్లో ప్రియాంక చోప్రా, ఐశ్వర్యారాయ్‌లు వున్నారు. నటుల సంగతికి వస్తే.. ఈ ఏడాది ప్రాణాలు కోల్పోయిన అలనాటి స్టార్ వినోద్ ఖన్నా అగ్రస్థానంలో వున్నారు. వినోద్ ఖన్నా మృతి చెందిన సమయంలో వివ‌రాలు తెలుసుకునేందుకు అధిక‌మంది యాహూలో శోధించారు. రెండో స్థానంలో కపిల్‌ శర్మ ఉన్నారు.
 
అయితే పబ్లిక్‌లో ఆకట్టుకునే వస్త్రధారణలో తాప్సీ అగ్రస్థానంలో నిలువగా, సన్నీలియోన్ వరస్ట్ డ్రెస్డ్ వుమెన్ కేటగిరీలో నిలిచింది. అలాగే పురుషుల్లో రణ్ వీర్ సింగ్ వరస్ట్ డ్రెస్డ్ మ్యాన్ కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచాడు. అదే పురుషుల్లో ఫ్యాషన్‌ లుక్‌లో అదిరిపోయే డ్రెస్ కోడ్‌లో ఆయుష్మాన్ టాప్‌లో నిలిచాడు.