శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 అక్టోబరు 2022 (15:37 IST)

జాతీయ అవార్డు ఫంక్షన్‌: తారల సందడి.. ఫోటోలు వైరల్

National Awards
National Awards
జాతీయ అవార్డు ఫంక్షన్‌లో తారలు సందడి చేశారు. అవార్డులు స్వీకరించి అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసుకున్నారు. తాజాగా గురువారం ఢిల్లీలో 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం చాలా ఘనంగా జరిగింది. ఇందులో టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొని తమకు వచ్చిన అవార్డులను స్వీకరించారు. 
 
ముఖ్యంగా ఈ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తారలకు అందజేయడం జరిగింది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అలవైకుంఠపురంలో చిత్రానికి గాను సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఇక అతను అవార్డు అందుకున్న ఫోటో కూడా ప్రస్తుతం వైరల్‌గా మారుతుంది. 
Surya
Surya
 
అలాగే కలర్ ఫొటో చిత్రానికి రెండు జాతి అవార్డులు లభించాయి. దర్శకుడు సందీప్ రాజ్, నిర్మాత సాయి రాజేష్ కూడా జాతీయ అవార్డులను అందుకున్నారు. అలాగే బెస్ట్ కొరియోగ్రఫీ విభాగంలో నాట్యం చిత్రానికి గాను సంధ్య రాజు అవార్డును అందుకోవడం జరిగింది. వీరితోపాటు సూర్య భార్య జ్యోతిక కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్‌గా మారుతున్నాయి. 
Jyothika
Jyothika