ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఆగస్టు 2023 (11:26 IST)

అతనితో డేటింగ్ చేయాల్సిన ఖర్మ పట్టలేదు : సుశ్మితా సేన్

Sushmita-Lalit modi
బాలీవుడ్ హీరోయిన్ సుశ్మితా సేన్ తనపై వస్తున్న డేటింగ్ పుకార్లపై స్పందించారు. ముఖ్యంగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సృష్టికర్త లలిత్ మోడీతో డేటింగ్‌ చేస్తున్నట్టు గత కొంతకాలంగా వస్తున్నాయి. పైగా, వీరిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు సైతం సోషల్ మీడియాలో షికారు చేశాయి. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్టు ప్రతి ఒక్కరూ బలంగా నమ్మారు కూడా. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తలపై తనదైనశైలిలో సమాధానం ఇచ్చింది. 'విమర్శలు, గాసిప్పులు మన వ్యక్తిగత జీవితాల్ని ప్రభావితం చేయకూడదు. వాటి గురించి ఎక్కువగా ఆలోచించినప్పుడే గందరగోళానికి గురవుతాం. అందుకే నేను వాటికి ఆస్కారం ఇవ్వను. నా వ్యక్తిగత జీవితం గురించి అందరితోనూ పంచుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇక విమర్శలంటారా? వాటిపై తగిన సమయంలో సమాధానం ఇస్తా' అని ఘాటుగా సమాధానమిచ్చారు.
 
ప్రస్తుతం ఈమె 'తాళి' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. ఈ లుక్‌పై కూడా పలు రకాలైన విమర్శలు కూడా వచ్చాయి. వాటి గురించి మాట్లాడుతూ 'సోషల్ మీడియాలో నెగిటివిటీ పెరిగిపోయింది. కొన్ని కామెంట్లు చూసి షాకయ్యాను. ఇలాక్కూడా జనం ఆలోచిస్తారా? అనిపించింది. అయితే వాటికి ప్రాధాన్యం ఇవ్వకూడదు. ఇస్తే ఇంకా ఎక్కువ మాట్లాడతారనిపించింది' అందుకే ఈ వివాదానికి అంతటితో ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.