శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 జూన్ 2023 (15:39 IST)

రాజకీయ నేత కుమారుడితో మేఘా ఆకాష్ డేటింగ్

Megha Akash
చెన్నై బ్యూటీ మేఘా ఆకాష్ డేటింగ్‌లో మునిగితేలుతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రముఖ రాజకీయ నాయకుడు కుమారుడితో ఆమె పీకల్లోతు డేటింగ్‌లో ఉన్నట్టు సమాచారం. పలు తెలుగు చిత్రాల్లో నటించిన మేఘా ఆకాష్... తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన విషయం తెల్సిందే. 
 
అదేసమయంలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతోంది. తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నేత కుమారుడితో ఆమె డేటింగ్‌లో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం సాగుతోంది.
 
ఇందుకోసం రహస్యంగా నిశ్చితార్థం ఏర్పాట్లు సాగుతున్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే, ఈ ప్రచారంపై ఇటు మేఘా ఆకాష్ లేదా ఆమె కుటుంబ సభ్యులు స్పందించక పోవడం గమనార్హం.