శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 19 మే 2021 (17:20 IST)

శ్రీ‌ముఖిని ఏడురోజులు త‌న‌తో వుండ‌మ‌న్న స్వామీజీ! (video)

srimukhi
యాంక‌ర్ నుంచి న‌టిగా మారిన శ్రీ‌ముఖి ప‌లు టీవీ షోలో పాల్గొంటుంది. త‌న‌దైన శైలిలో హుషారుగా మాట్లాడుతూ ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ఆమ‌ధ్య `పుష్ప‌` ట్రైల‌ర్‌లో యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించి అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను ఫిదాచేసింది. అంతేకాకుండా అల్లు అర్జున్ వ‌చ్చేవ‌ర‌కు ర‌క‌ర‌కాలుగా డాన్స్ ప్రోగ్రామ్‌లు జ‌రిగాయి. ఇదిగో అదిగో వ‌చ్చేస్తున్నాడు స్ట‌యిలిష్ స్టార్ అంటూ తెగ గంద‌ర‌గోళం చేసింది. ఇక అల్లు అర్జున్ రాగానే ఐల‌వ్‌యు అంటూ తెగ సంద‌డిచేసింది. ఇది యాంక‌ర్‌గా హీరోల‌ను మెప్పుకోసం చేయ‌డం మామూలు అయినా అల్లు అర్జున్ అంటే ఆమె విప‌రీత‌మైన అభిమానం.
 
ఇదిలా వుండ‌గా, త‌ను ఈమ‌ధ్య బాగా ఒళ్ళుచేసింది. వెయిట్ లాస్ కోసం చాలా ప్ర‌య‌త్నాలు చేసింది. కానీ త‌గ్గ‌లేదు. అందుకు కార‌ణం ఆమె తిండిపోతు కావ‌డ‌మే. ఏదైనా ఇష్టంగా తినేస్తుంది. ఆపుకోలేదు. అందుకే త‌న బాధ‌ను ఇటీవ‌లే ఓ ఫంక్ష‌న్‌లో హాజ‌రైన దేవిశ్రీ‌గురూజీ స్వామిని క‌లిసింది. ఆయ‌న క‌న‌బ‌డ‌నే స్వామీజీ రోజువారీ ఈ ఛాన‌ల్ లో ఆద్యాత్మిక విష‌యాలు, ఆరోగ్యం గురించి చెబుతారు. నాకు ఒళ్ళు పెరిగిపోతుంది. నేను తిండిని కంట్రోల్ చేయ‌లేక‌పోతున్నా. నాజుగ్గా కావాలంటే ఏం చేయాలో చెప్ప‌మంది. వెంట‌నే గురూజీ..  ఓవారం పాటు నాతోనే వుండు. నేను చెప్పిన విధంగా చేస్తే మొత్తం కంట్రోల్ అవుతుంది అన్నాడు. అందుకు వెంట‌నే వామ్మో! మాలాంటి యాంక‌ర్ల‌కు వారం రోజులు అంటే ఆదాయం పోతుందంటూ ఉన్న విష‌యాన్ని చెప్పేసింది. ఇక మీ ఇష్టం అంటూ ఆయ‌న ఒక లుక్ ఇచ్చాడు. మ‌రి స్వామీజీల‌తో పెట్టుకుంటే అంతే మ‌రి. మ‌రి త‌ను ఎలా ఒల్లు త‌గ్గించుకుంటుందో చూడాలి.