శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (23:23 IST)

నేను 8 నెలల గర్భిణిని, ఐతే నా భర్తతో అలా చేస్తున్నానంటున్న స్వాతినాయుడు

స్వాతి అంటే చాలామంది తెలియదు కానీ స్వాతినాయుడు అంటే మాత్రం ఇట్లే గుర్తు పట్టేస్తారు. ఆమె చేసిన వీడియోలు అలాంటివి మరి. యు ట్యూబ్‌లో ట్రెండింగ్ సృష్టించాయి స్వాతినాయుడు చేసిన వీడియోలు. ఒకటి రెండు కాదు ఆమె చేసిన వీడియోలు ఎన్నో సంచలనంగా మారాయి. 
 
బోల్డ్‌గా ఆమె మాట్లాడే మాటలు యువతను మరింత ఉర్రూతలూగించేవి. అందుకే స్వాతినాయుడు అలా ఫేమస్ అయ్యారు. అయితే ఆమె పెళ్లి చేసుకోవడం మాత్రం కాస్త ఆలస్యమైనా తన చిన్ననాటి స్నేహితుడితో సహజీవనం చేసి మరీ పెళ్లి చేసుకుంది.
 
అది కూడా సరిగ్గా 2019 సంవత్సరంలో స్వాతినాయుడు పెళ్లి జరిగింది. ప్రస్తుతం స్వాతినాయుడు 8 నెలల గర్భవతి. రెండురోజుల క్రితమే ఆమె సీమంతం విజయవాడలో జరిగింది. సామాజిక దూరం పాటిస్తూ సీమంతం జరుపుకుంది స్వాతినాయుడు. 
 
అయితే స్వాతినాయుడు సీమంతంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నేను తల్లిని కాబోతున్నాను. చాలా సంతోషంగా ఉంది. అయితే మా డాక్టర్ నన్ను, ఆయన్ను ఇప్పుడు కలవకూడదని చెబుతున్నారు. కానీ నేను ఒప్పుకోవడం లేదు. మేమిద్దరం ఇప్పటికీ కలుస్తున్నాం. అయితే పొట్టపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రస్తుతం కలుస్తున్నామని బోల్డ్‌గా చెబుతోంది స్వాతినాయుడు. బిడ్డ పుట్టిన తరువాత కూడా తన కెరీర్‌ను మాత్రం అలాగే కొనసాగిస్తానని చెబుతోంది.