సోమవారం, 30 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 20 డిశెంబరు 2019 (21:42 IST)

గర్భధారణ సమయంలో ఎలాంటి మేకప్, బట్టలు వేసుకోవాలంటే?

సాధారణంగా గర్భిణీ స్త్రీలు గర్భవతులుగా ఉన్నప్పుడు ఇష్టమొచ్చినట్లు మేకప్‌లు వేసుకోవడం.. డ్రస్‌లు కూడా టైట్‌గా ధరించడం వంటివి చేస్తుంటారు. అయితే అలాంటి మహిళలు కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా బట్టల విషయంలో అయితే మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
 
గర్భం ధరించినప్పుడు లైట్ మేకప్ హుందాగా ఉంటుంది. పలుచని కాటుక రేఖ, లైట్ ఫౌండేషన్ ఆకర్షణీయంగా ఉంటుందట. ఇంట్లో వాడకానికి మేక్సీ లేదా గౌను చాలా సుఖంగా ఉంటుందట. అలాగే పెరిగిన శరీరాన్ని కాటన్ శారీ బాగా కప్పుతుందట. అలాగే బ్లౌజ్ లూజ్‌గా ఉంటేనే మంచిదంటున్నారు వైద్య నిపుణులు. 
 
టైట్‌గా ఉండే వస్త్రాలు రక్తప్రవాహానికి ఇబ్బంది కలిగిస్తాయట. బ్రా అంత టైట్‌గా అస్సలు వేసుకోకూడదట. అలాగే అంత లూజ్ గానూ వద్దంటున్నారు వైద్య నిపుణులు. గర్భావస్థలో స్తనాలు పెరుగుతాయి. అందువల్ల అవి జారిపోకుండా ఉండేందుకు తగినట్లుగా జాకెట్ ఉండాలట.
 
హై హీల్స్ శాండిల్ అస్సలు వేసుకోకూడదట. ఫ్లాట్ శాండిల్స్ చెప్పులు మంచివట. సింథెటిక్, పాలియస్టర్, నైలాన్ వస్త్రాలకు దూరంగా ఉండాలట. ఇవి చర్మానికి మంచివి కావట. ఈ వస్త్రాలు దురదలకు కారణం కావచ్చంటున్నారు వైద్య నిపుణులు. వంటింట్లో పనిచేసేటప్పుడు సాదా రబ్బరు చెప్పులు కాటన్ వస్త్రాలు వాడాలట. ఈ స్థితిలో ఎప్పుడూ స్టూల్, టేబుల్ పైకెక్కి అస్సలు పనిచేయకూడదు. మెట్లు ఎక్కిదిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మెల్లగా ఎక్కిదిగాలి. తొందరపడకూడదట.