అవసరం వాళ్లది.. అందుకే డిమాండ్ చేస్తున్నా.. ఇందులో తప్పేంటి: తమన్నా
ఐటమ్ పాటల్లో నటించేందుకు భారీగా రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేయడంపై మిల్కీ బ్యూటీ తమన్నా స్పందించారు. నా అవసరం వాళ్ళకు ఉంది. అందుకే నేను భారీగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నా. ఇందులో తప్పేముంది అంటూ మీ
ఐటమ్ పాటల్లో నటించేందుకు భారీగా రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేయడంపై మిల్కీ బ్యూటీ తమన్నా స్పందించారు. నా అవసరం వాళ్ళకు ఉంది. అందుకే నేను భారీగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నా. ఇందులో తప్పేముంది అంటూ మీడియాను ప్రశ్నించారు.
హైదరాబాద్ ఆమె మీడియాతో మాట్లాడుతూ... 'జాగ్వార్' చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో నటిస్తున్నట్టు చెప్పారు. ఈ పాట కోసం రూ.2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు చెప్పుకొచ్చింది. దీనికి కారణం లేకపోలేదన్నారు.
ఇకపోతే.. పెళ్లి ఆలోచన తన మదిలోనే లేదన్నారు. చిత్ర పరిశ్రమ నుంచి తనను దూరం చేయాలని చూస్తున్నారా అంటూ మీడియాను ప్రశ్నించారు. మరికొంతకాలం చిత్ర పరిశ్రమలో కొనసాగుతానని తమన్నా తేల్చి చెప్పింది.