శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 3 జూన్ 2017 (21:56 IST)

షాకింగ్... 60 ఏళ్ల సినీ దర్శకుడు 30 ఏళ్ల హీరోయిన్‌తో ప్రేమ పెళ్లి....

ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు... నిజం. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లి జరిగింది. సక్సెస్‌ఫుల్ సినిమాలు తీస్తూ వున్న 60 ఏళ్ల డైరెక్టర్ ఓ సినీ హీరోయిన్‌ను పెళ్లాడారు. వివరాల్లోకి వెళితే... తమిళ చిత్ర దర్శకుడు వేలు ప్రభాకరన్‌ కొత్తగా తమిళంలో ‘ఒర

ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు... నిజం. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లి జరిగింది. సక్సెస్‌ఫుల్ సినిమాలు తీస్తూ వున్న 60 ఏళ్ల డైరెక్టర్ ఓ సినీ హీరోయిన్‌ను పెళ్లాడారు. వివరాల్లోకి వెళితే... తమిళ చిత్ర దర్శకుడు వేలు ప్రభాకరన్‌ కొత్తగా తమిళంలో ‘ఒరు ఇయక్కునరిన్ కాదల్ డైరీ’ , తెలుగులో ‘ఓ దర్శకుడి ప్రేమ డైరీ’ పేరుతో సినిమాను రూపొందించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆయనే హీరో కావడం గమనార్హం. 
 
ఈ చిత్రంలో 30 ఏళ్ల షెర్లీ దాస్‌ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం తీసే సమయంలోనే ఆమెతో స్నేహం కుదిరింది. ఐతే అది మూడో కంటికి తెలియరాలేదు. అది కాస్తా పెళ్లికి దారితీసింది. గమనించాల్సిన విషయం ఏమంటే... ఈ చిత్రం నిన్న శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రివ్యూకు రమ్మన్న దర్శకుడు మీడియాకు సినిమా చూపించారు. 
 
ఆ తర్వాత మీడియా ముఖంగా తను చిత్ర హీరోయిన్ షెర్లీని పెళ్లాడుతున్నట్లు ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేశారు. కాగా ఆయన తీసిన చిత్రం కూడా ఓ వృద్ధ దర్శకుడు తన వయసులో సగం వున్న హీరోయిన్ ను పెళ్లాడటమే ఇతివృత్తం. సినిమా కథలానే నిజ జీవితంలో వారిరువురూ ఒక్కటయ్యారు.