సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 2 జులై 2017 (11:01 IST)

రోజూ తాగొచ్చి చావబాదుతున్నాడు : నటుడిపై భార్య ఫిర్యాదు

తమిళ బుల్లితెర, సినీ నటుడిపై అతని భార్య చెన్నై నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రతి రోజూ మద్యం సేవించి వచ్చి తమను చావబాదుతున్నాడంటూ ఆమె చేసిన ఫిర్యాదులో పేర్కొంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను

తమిళ బుల్లితెర, సినీ నటుడిపై అతని భార్య చెన్నై నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రతి రోజూ మద్యం సేవించి వచ్చి తమను చావబాదుతున్నాడంటూ ఆమె చేసిన ఫిర్యాదులో పేర్కొంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... ప్రముఖ నటుడు 'దాడి' బాలాజీకి నిత్య అనే మహిళతో కొన్నేళ్ళ క్రితం వివాహమైంది. వీరికికి ఓ కుమార్తె కూడా ఉంది. అయితే, శనివారం నిత్య తన కుమార్తెతో కలిసి వచ్చిన చెన్నై నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. రోజూ తాగొచ్చి తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, అతనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరింది. 
 
ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'నా భార్త రోజు తాగొచ్చి కొడుతున్నాడు. గత నెలలో అతను కొట్టడంతో పెద్ద గాయమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. ఆయనకి, నాకు 15 ఏళ్లు వ్యత్యాసం. పైగా ఇదివరకే పెళ్లయింది. ఆ విషయం పెళ్లయ్యాకే నాకు తెలిసింది. మొదటి భార్యలాగే నేను కూడా వదిలేసి వెళ్లిపోతానేమోనన్న భయం ఆయనకి ఉంది. నేను ఇంతకుముందు రెండు, మూడు కంపెనీల్లో పనిచేశాను. అక్కడికొచ్చి ఆయన గొడవ చేశాడు. నన్ను అనుమానిస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను’ అని చెప్పింది.