గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (16:33 IST)

నిర్మాత దిల్ రాజు సారథ్యంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ 66వ సినిమా

తమిళ స్టార్ విజయ్ చేసే ప్రతి సినిమా ఓ విభిన్నమైన కథతో వుంటుంది. ఇకపోతే తాజా వార్త ఏంటయా అంటే... విజయ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్నాడు.

ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గెలుచుకున్న నిర్మాత దిల్ రాజు &శిరీష్ వారి నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆధ్వర్యంలో నిర్మించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.
 
ఈ రోజు ఈ సినిమా అధికారికంగా ప్రకటించారు. దళపతి విజయ్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబినేషన్ అనగానే దక్షిణాదిలో మంచి క్రేజ్ ఏర్పడింది. విజయ్ తన 65వ చిత్రం బీస్ట్‌ ముగియగానే ఈ చిత్రం ప్రారంభమవుతుంది. ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు, అగ్రశ్రేణి సాంకేతిక బృందం పనిచేయనున్నారు.